DJ Tillu Sequel: రాధికగా అనుపమ కాదు.. ఎవరంటే?

ABN , First Publish Date - 2022-08-19T22:45:06+05:30 IST

ఈ యేడాది హిట్టందుకున్న సినిమాలలో ‘డిజె టిల్లు’ (DJ Tillu) కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) యాక్టింగ్, నేహా శెట్టి (Neha Shetty) అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా..

DJ Tillu Sequel: రాధికగా అనుపమ కాదు.. ఎవరంటే?

ఈ యేడాది హిట్టందుకున్న సినిమాలలో ‘డిజె టిల్లు’ (DJ Tillu) కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) యాక్టింగ్, నేహా శెట్టి (Neha Shetty) అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సారి సీక్వెల్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు మారినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే హీరోయిన్‌గా నేహ శెట్టిని పక్కన పెట్టేసి.. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)ను తీసుకుంటున్నట్లుగా గత వారం రోజులుగా టాలీవుడ్‌లో వార్తలు హల్‌‌చల్ చేస్తున్నాయి. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రంతో అనుపమకు మంచి హిట్టొచ్చింది. ఆ భామ పేరు వినబడగానే ‘డిజె టిల్లు’ సీక్వెల్ స్వరూపమే మారిపోయింది. కానీ ఇప్పుడు అనుపమ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేయడం లేదనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సీక్వెల్‌లో నటించబోయే మరో హీరోయిన్ ‌పేరు కూడా అప్పుడే తెరపైకి తెచ్చేశారు. 


‘పెళ్లి సందD’ (Pelli SandaD) చిత్రంతో ఒక్కసారిగా తన టాలెంట్ చూపించిన భామ ‘శ్రీలీల’ (Srileela). ఆ సినిమా తర్వాత ఆమె గురించి వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ వార్తలు వైరల్ అయ్యాయి. వ్యక్తిగతంగా ఎవరి కుమార్తె అనే విషయంపై చర్చలు జరగగా, వృత్తిపరంగా.. తదుపరి చిత్రమే రవితేజ (Ravi Teja) వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం. ఆ ఛాన్స్‌తో పాటు.. వరుసగా ఐదారు సినిమాలలో ఆమెకు అవకాశాలు రావడంతో.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా శ్రీలీల పేరు మారుమోగింది. ఇప్పుడీ భామని ‘డిజె టిల్లు’ సీక్వెల్ కోసం చిత్రబృందం సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఆమె కూడా ఈ సినిమాలో చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే అధికారికంగా ఆమె పేరును ప్రకటించనున్నారనేలా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Updated Date - 2022-08-19T22:45:06+05:30 IST