Anupam Kher: ‘రాక్రెటీ: ది నంబి ఎఫెక్ట్’ పై బాలీవుడ్ నటుడి రివ్యూ

ABN , First Publish Date - 2022-07-20T23:31:51+05:30 IST

భాషతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంటాడు

Anupam Kher: ‘రాక్రెటీ: ది నంబి ఎఫెక్ట్’ పై  బాలీవుడ్ నటుడి రివ్యూ

భాషతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంటాడు. తాజాగా అతడు నటించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సౌత్‌లోని అన్ని భాషలతో పాటు హిందీలోను జులై 1న విడుదలైంది. అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించకుంది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) వీక్షించాడు. చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. 


‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ను ప్రతి భారతీయుడు తప్పక వీక్షించాలని అనుపమ్ ఖేర్ చెప్పాడు. మాధవన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. నంబి నారాయణ్‌‌న్‌కు క్షమాపణలు చెప్పాడు. ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ‘‘అద్భుతమైన సినిమాను నిర్మించినందుకు థ్యాంక్ యూ మాధవన్. నిన్ను చూసి గర్విస్తున్నాను. ఈ చిత్రం నేటి తరానికి తప్పకుండా స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నాడు. మాధవన్ ఈ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో రీ షేర్ చేశాడు. ‘‘మీరు పెద్ద మనస్సుతో సినిమాను ప్రశంసించారు. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ మాటలకు నేను కృతజ్ఞుణ్ణి’’ అని మాధవన్ చెప్పాడు.  



Updated Date - 2022-07-20T23:31:51+05:30 IST