Anupam Kher: సౌత్ ఇండస్ట్రీ కథలను చెబుతుంటే.. బాలీవుడ్ మాత్రం స్టార్స్‌ను అమ్ముతుంది...

ABN , First Publish Date - 2022-08-27T00:01:56+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)లో ఓ

Anupam Kher: సౌత్ ఇండస్ట్రీ కథలను చెబుతుంటే.. బాలీవుడ్ మాత్రం స్టార్స్‌ను అమ్ముతుంది...

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)లో ఓ కీలకమైన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తాజాగా నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ-2’ (Karthikeya 2)లో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో సంచలన విజయం సాధించడంతో తన సంతోషాన్ని అనుపమ్ మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  


బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య వసూళ్లను సాధించలేకపోతున్న విషయం తెలిసిందే. కానీ, దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన చిత్రాలు మాత్రం కలెక్షన్స్‌ను కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ వర్సెస్ నార్త్ అనే టాపిక్‌పై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. దీంతో రెండు ఇండస్ట్రీలకు గల తేడాను అనుపమ్ వివరించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్‌ను అమ్ముతుంటే, సౌత్ కథలను అద్భుతంగా చెబుతుందన్నాడు. ‘‘సినిమాలను ప్రేక్షకుల కోసం రూపొందిస్తాం. ఏ రోజైతేనే వారిని తక్కువగా చూడటం మొదలుపెడతమో అప్పుడే సమస్య మొదలవుతుంది. కలసికట్టుగా అందరు పనిచేస్తేనే మూవీ రూపొందుతుంది. నేను తెలుగు చిత్రాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. తమిళం, మళయాలంలోను సినిమాలు చేశాను. వారు ఏ ఇండస్ట్రీని అనుసరించడం లేదు. సౌత్ ఇండస్ట్రీ కథలను చెబుతుంటే, బాలీవుడ్ మాత్రం స్టార్స్‌ను అమ్ముతుంది’’ అని అనుపమ్ ఖేర్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అనుపమ్ ఖేర్ ‘ఎమర్జెన్సీ’ (Emergency) లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జయప్రకాష్ నారాయణ్ పాత్రను పోషించనున్నాడు. సూరజ్ బర్జత్యా తెరకెక్కిస్తున్న ‘ఉంఛయ్’ లోను కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా కీలక పాత్రలు పోషించనున్నారు.   

Updated Date - 2022-08-27T00:01:56+05:30 IST