Emergency: జయప్రకాశ్ నారాయణ్‌గా విలక్షణ నటుడు.. ఫస్ట్‌లుక్ విడుదల

ABN , First Publish Date - 2022-07-22T17:31:07+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా సినిమా తీస్తోంది...

Emergency: జయప్రకాశ్ నారాయణ్‌గా విలక్షణ నటుడు.. ఫస్ట్‌లుక్ విడుదల

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా సినిమా తీస్తోంది. ‘ఎమర్జెన్సీ(Emergency)’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో కంగననే ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి కంగననే దర్శకురాలు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌లో ఇందిరగా కంగనా అదరగొట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. 


ఈ చిత్రంలో రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ (Jayaprakash Narayan) పాత్రను బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) పోషిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది. 1970లలో ఇందిరా గాంధీకి నారాయణ్ ముఖ్యమైన ప్రత్యర్థిగా ఉండేవారు. అందుకే ‘ఎమర్జెన్సీ’లో అనుపమ్‌ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండనుంది. కంగనా సొంత బ్యానర్ మణికర్ణిక ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.


ఇందిర హయాంలో పలు కారణాల వల్ల 1975 నుంచి 1977 వరకు 21 నెలలపాటు ఎమర్జెన్సీని విధించారు. అందుకే ఈ సమయాన్ని స్వతంత్ర భారతదేశంలోని చీకటి కాలంగా చెబుతారు. కాగా.. కంగనా ప్రస్తుతం ‘తేజస్’, ‘మణికర్ణిక సీక్వెల్’లో నటిస్తున్నాయి. అలాగే తన బ్యానర్‌‌లో ‘టికు వెడ్స్ షేరు’ అనే సినిమాని కూడా నిర్మిస్తోంది.



Updated Date - 2022-07-22T17:31:07+05:30 IST