Ante Sundaraniki : ఓటీటీ పార్టనర్ అమెజాన్ ప్రైమ్ కాదా?

ABN , First Publish Date - 2022-06-09T17:25:40+05:30 IST

నేచురల్‌స్టార్ నానీ (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Nazeem) జోడీగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ..’ (Ante Sundaraniki). నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Ante Sundaraniki : ఓటీటీ పార్టనర్ అమెజాన్ ప్రైమ్ కాదా?

నేచురల్‌స్టార్ నానీ (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Nazeem) జోడీగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ..’ (Ante Sundaraniki).  నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేశ్, నదియా, హర్షవర్ధన్, రోహిణి, అళగన్ పెరుమాళ్, రాహుల్ రామకృష్ణ ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఎలాగోలా.. అమెరికాకి వెళ్ళిపోవాలనుకొనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుందర ప్రసాద్, క్రిస్టియన్ ఫోటోగ్రాఫరైన లీలా థామస్ కథే ‘అంటే సుందరానికీ’. పెళ్ళిచేసుకోడానికి ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పిన కట్టుకథలు ఎక్కడికి దారితీశాయి? దురదృష్టవశాత్తు ఆ కథల్లో ఒకటి కూడా నిజంలేదని ఇంట్లోవారికి తెలిసిన తర్వాత వారిని  ఆ ఇద్దరూ ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే మిగిలిన కథ. ఇది రెండు మతాలకి చెందిన ప్రేమికుల కథే కాదు.. రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన కథగా నిర్మాతలు చెబుతున్నారు. 


ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ‘మెంటల్ మదిలో (Mental Madilo), బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) చిత్రాలతో వివేక్ ఆత్రేయ వరుస హిట్స్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ అయింది. ఈ నెల 10న అంటే రేపే ఈ సినిమా ప్రపంచ వ్యా్ప్తంగా థియేటర్స్ లో విడుదలవుతోంది. తమిళ, మలయాళ భాషల్లో సైతం ఈ సినిమా విడుదలవుతోంది. ఇక సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వారు కాకుండా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వారు కైవసం చేసుకున్నారట. నిజానికి అమెజాన్‌ప్రైమ్ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన మూడు వారాలకు స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటి వరకూ వార్తలొచ్చాయి. అయితే ఇటీవల  ప్రచార కార్యక్రమాల్లో.. ‘అంటే సుందరానికీ’ చిత్రం స్ట్రీమ్ పార్టనర్ అమెజాన్ కాదని నానీ వెల్లడించాడు.  దాంతో ఈ సినిమా ఓటీటీ పార్టనర్ విషయంలో మళ్ళీ వార్తల్లో నిలిచింది. మరి నిజంగానే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-06-09T17:25:40+05:30 IST