Ante Sundaraniki : ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే.. !

ABN , First Publish Date - 2022-07-04T14:02:49+05:30 IST

నేచురల్ స్టార్ నానీ (Nani), మల్లూ కుట్టి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) జంటగా నటించిన వినోదాత్మక ప్రేమకథా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 10న థియేటర్స్ లోకి వచ్చింది.

Ante Sundaraniki : ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే.. !

నేచురల్ స్టార్ నానీ (Nani), మల్లూ కుట్టి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) జంటగా నటించిన వినోదాత్మక ప్రేమకథా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki).  వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 10న థియేటర్స్ లోకి వచ్చింది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ నిరాశపరిచాయి. ఒక సదాచార బ్రాహ్మణ యువకుడు, ఆర్దోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో ప్రేమలో పడడం, తమ పెళ్ళి కోసం పెద్దల్ని ఒప్పించడంలో కష్టాలెదుర్కోవడం.. ఈ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నరేశ్, తులసి, యల్బీ శ్రీరామ్, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, పవిత్రా లోకేశ్, పృధ్విరాజ్, మాస్టర్ విన్నీ  తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. 


నానీ, నరేశ్ పోటీపడుతూ మరీ నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. దానికి సమయం ఆసన్నమైంది. అంటే సుందరానికీ చిత్రం ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సరిగ్గా సినిమా విడుదలైన నెలరోజులకు ఓటీటీలో రానుండడం గమనార్హం. ఈ విషయాన్ని మేకర్స్.. ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా తెలిపారు. సుందర్, లీలా వివాహకథను చూసేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం..తేదీని సేవ్ చేసుకోండి.. అంటూ వినూత్నంగా ప్రకటించారు. 


తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. నజ్రియా నజిమ్ కథానాయికగా నటించిన తొలి తెలుగు చిత్రం కావడంతో ఈ సినిమాకి మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. థియేటర్స్ లో కాస్తంత నిరాశపరిచిన ‘అంటే సుందరానికీ’ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో ప్రేక్షకాదరణను పొందుతుందో చూడాలి. 



Updated Date - 2022-07-04T14:02:49+05:30 IST