ANR: 30 వసంతాల కాలేజీ బుల్లోడు!

ABN , First Publish Date - 2022-07-04T03:25:34+05:30 IST

1970ల్లో ‘దసరా బుల్లోడు’గా సందడి చేసిన అక్కినేని నాగేశ్వరరావు.. 1992లో ‘కాలేజీ బుల్లోడు’గా కుర్రాడి అవతారమెత్తారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన శరత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కినేనితోపాటు రాధిక, యమున, హరీశ్‌, రాజ్‌ కుమార్‌, సత్యనారాయణ, బ్రహ్మానందం, బాబూ మోహన్‌, నర్రా వెంకటేశ్వరరావు, వై.విజయ తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించారు.

ANR: 30 వసంతాల కాలేజీ బుల్లోడు!

1970ల్లో ‘దసరా బుల్లోడు’గా సందడి చేసిన అక్కినేని నాగేశ్వరరావు (Anr) 1992లో ‘కాలేజీ బుల్లోడు’గా (Collage bullodu)కుర్రాడి అవతారమెత్తారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన శరత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కినేనితోపాటు రాధిక, యమున, హరీశ్‌, రాజ్‌ కుమార్‌, సత్యనారాయణ, బ్రహ్మానందం, బాబూ మోహన్‌, నర్రా వెంకటేశ్వరరావు, వై.విజయ తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించారు. ‘ర్యాంగింగ్‌ ఆట... రాగాలాట’ అంటూ సాగే పాటలో డిస్కోశాంతి కనిపించారు. రాజ్‌ – కోటి సంగీతం అందించిన ఈ చిత్రానికి వేటూరి సాహిత్యం అందించారు.   (Anr College Bullodu completes 30years )


పారిశ్రామికవేత్త అయిన గోపాలకృష్ణ (ఏయన్నార్‌) నిరక్షరాస్యుడు. కొడుకు రాజా (హరీశ్‌)ని దారిలోకి తెచ్చుకోవడం కోసం 50 ఏళ్ళ వయసులో కాలేజ్‌లో చేరతాడు.  గోపాలకృష్ణ అనుకున్నది సాధించాడా  లేదా? అన్నది కథ. బి. వెంకట్రావు కథను అందించిన ఈ చిత్రానికి సత్యానంద్‌ మాటలు, భమిడిపాటి రాధాకృష్ణ స్ర్కీన్‌ప్లే అందించారు. శ్రీ అనుపమ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి.బలరామ్‌ నిర్మించిన ఈ చిత్రం 1992 జూలై 2న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ నెల రెండో తేదీకి ఈ చిత్రం విడుదలై 30 వసంతాలు పూర్తయింది. (Anr College Bullodu completes 30years) 




ఈ సందర్భంగా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘1972 నుంచి అక్కినేని గారితో నాకు పరిచయం ఉంది. లక్ష్మీ ఫిల్మ్స్‌ ఉద్యోగిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తుండేవాడిని. ఆ పరిచయం చనువుగా మారడం నా అదృష్టం. ఏయన్నార్‌తో నాకున్న అనుబంధం ఆయనతో ఓ సినిమా తీయాలనే కోరిక కలిగించింది. ఆ విషయాన్ని ఆయన ముందు ఉంచగానే అంగీకరించారు. ఆయనతో నా మొదటి చిత్రం ‘ప్రాణదాత’ తీసి విజయం సాధించాం. 1992లో ‘కాలేజీ బుల్లోడు’ తీసి విడుదల చేశాం. సినిమా పెద్ద హిట్‌ అయింది. కానీ ఆ చిత్రం విడుదలకు చాలా కష్టపడ్డాను. మద్రాస్‌, హైదరాబాద్‌లో కలిపి 55  బిజినెస్‌ షోస్‌ వేశాను. ఎవరికీ సినిమా నచ్చలేదు. అక్కినేని నాగేశ్వరరావుకి పూల చొక్కాలేంటి? డిస్కోశాంతితో డాన్స్‌లేంటి? అని ఎవరూ సినిమా కొనలేదు. నా సినిమా పూర్తి చేసి ఏయన్నార్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లి మూడు నెలల తర్వాత వచ్చారు. సినిమా విడుదల గురించి ఆరా తీశారు. ‘ఎవరికీ నచ్చక సినిమా కొనలేదని, రామానాయుడుగారిలాంటివారిని పట్టుకుని నేనే ఓన్‌ రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నా’ అని ఆయనకు చెప్పాను. ఇవన్నీ విన్న ఆయన కాస్త హర్ట్‌ అయ్యారు. అదే రోజు సాయంత్రం ఫోన్‌ చేసి ‘రేపు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంటికి రా’ అని ఆహ్వానించారు. ఇంటికి వెళ్లగానే ఆఫీస్‌ రూమ్‌లో కూర్చొమని నేను ఆయనకు ఎంత పారితోషికం ఇచ్చానో అంతా తిరిగి ఇవ్వడానికి చెక్‌ రాసి రెడీగా ఉన్నారు. ‘నటుడిగా మీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చాను. నేను వెనక్కి తీసుకోను’ అని తిరస్కరించా. ఆయన బ్లెసింగ్స్‌తో సినిమా విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నాం. పంతం కోసం ఆ చిత్రం వంద రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించాను. చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా చేశా. దుక్కిపాటి మధుసూధనరావుగారు నాగేశ్వరరావుగారికి స్వర్ణ కంకణంతో సత్కరించారు. అలాంటి చిత్రం అప్పుడే 30 వసంతాలు పూర్తి చేసుకుందంటే నమ్మ సఖ్యంగా లేదు. అక్కినేని కలిసి నటించాలనుందనే కోరికను చిరంజీవి అదే వేదిక మీద బయటపెట్టారు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రం వచ్చింది’’ అని కాట్రగడ్డ ప్రసాద్‌ తెలిపారు. (Anr College Bullodu completes 30 years )





Updated Date - 2022-07-04T03:25:34+05:30 IST