‘ఎఫ్ 4’ లో మరో స్టార్ హీరో కచ్చితంగా ఉంటాడు : Anil Ravipudi

ABN , First Publish Date - 2022-05-26T16:42:05+05:30 IST

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’ (f3) . సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2)కిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రల్ని కంటిన్యూ చేస్తూ వేరే కథతో ఈ సినిమా రూపొందింది. కథానాయికలుగా తమన్నా (Tamanna), మెహ్రీన్ (Mehreen) కంటిన్యూ అవుతుండగా.. సునీల్, మురళీ శర్మ పాత్రలు ‘ఎఫ్ 3’ లోకి అదనంగా వచ్చి చేరాయి.

‘ఎఫ్ 4’ లో మరో స్టార్ హీరో కచ్చితంగా ఉంటాడు : Anil Ravipudi

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’ (f3) . సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2)కిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రల్ని కంటిన్యూ చేస్తూ వేరే కథతో ఈ సినిమా రూపొందింది. కథానాయికలుగా తమన్నా (Tamanna), మెహ్రీన్ (Mehreen) కంటిన్యూ అవుతుండగా.. సునీల్, మురళీ శర్మ పాత్రలు ‘ఎఫ్ 3’ లోకి అదనంగా వచ్చి చేరాయి. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 27న అంటే రేపే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్‌లైన్ తో అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకొన్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది చిత్ర బృందం. 


ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీని తర్వాత ‘ఎఫ్ 4’ (f4 ) కూడా ఉంటుందని వెల్లడించాడు. నిజానికి ‘ఎఫ్ 3’ ( f3) లో మరో స్టార్ హీరోని అనుకున్నామని, అయితే ఆల్రెడీ ఇందులో కావల్సినంత ఫన్ వచ్చేసిందని, అందుకే ఆ అవసరం రాలేదని అనిల్ చెప్పారు. అంతేకాదు.. ‘ఎఫ్ 4’ చిత్రంలో కచ్చితంగా మరో స్టార్ హీరో ఉంటాడని చెప్పి మూడో భాగంపై మరింత ఆసక్తిని కలిగించారు. దాంతో మూడో భాగంలో మరో హీరో ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయంలో కూడా ఆత్రుతగా ఉన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకొన్న ఈ సినిమాకి ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు. రెండున్నగర గంటలకు పైగానే కంటిన్యూస్ గా చిత్రం తెరపై నవ్వులు పూయించబోతోంది. 


ప్రస్తుతం ‘ఎఫ్ 3’ (F3) చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నడుస్తోంది. డబ్బు చుట్టూ తిరిగే కథతో.. రేచీకటితో బాధపడే పాత్రలో వెంకీ (Venky), నత్తితో ఇబ్బందిపడే యువకుడిగా వరుణ్ (Varun) హిలేరియస్ కామెడీ పండించబోతున్నట్టు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెబుతున్నారు. ఈ రెండు పాత్రలతో తెరపై కావల్సినంత వినోదం వర్కవుట్ అయిందని.. సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు నవ్వుతునే ఉంటారని మేకర్స్ చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ తర్వాత ఈ తరహాలో ఫన్ రైడ్ మూవీ టాలీవుడ్‌లో ఇంతవరకూ విడుదలవలేదు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓరేంజ్ లో నవ్వుల దాడి చేస్తుందని అంటున్నారు. 

Updated Date - 2022-05-26T16:42:05+05:30 IST