Tollywood Problems: షూటింగ్‌ల విషయంలో మరో గందరగోళం!

ABN , First Publish Date - 2022-08-01T22:47:54+05:30 IST

టాలీవుడ్‌లో మరో గందరగోళం మొదలైంది. సోమవారం నుంచి షూటింగ్‌లు నిలిపి వేయాలని చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతలు ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి సోమవారం చిత్రీకరణలు నిర్వహించారు.

Tollywood Problems: షూటింగ్‌ల విషయంలో మరో గందరగోళం!

టాలీవుడ్‌లో మరో గందరగోళం మొదలైంది. సోమవారం నుంచి షూటింగ్‌లు (Shootings problems)నిలిపి వేయాలని చలన చిత్ర వాణిజ్య మండలి(Film chamber), నిర్మాతలు (Tollywood producers)ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి సోమవారం చిత్రీకరణలు నిర్వహించారు. దిల్‌ రాజు (Drilraju)నిర్మాణంలో విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారసుడు’(varasudu), ధనుష్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘సార్‌’ (Sir movie)చిత్రాల షూటింగ్‌ యథావిధిగా జరిగాయి. దీనితో కొందరు నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం బంద్‌ ప్రకటించుకొని ఇలా చేయడం కాదని అంటున్నారు. దీనిపై ఫెడరేషన్‌ క్లారిటీ ఇచ్చింది. చిత్రీకరణలు నిలిపి వేయాలని తమకు ఎలాంటి నోటీస్‌ అందలేదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఛాంబర్‌ అప్రమత్తమైంది. చిత్రీకరణల నిలిపివేయడంపై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధికారికంగా లేఖ పంపనుంది. ఈ విషయంపై ఫిల్మ్‌ఛాంబర్‌ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడిగా తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. అయితే దిల్‌ రాజు సినిమా చిత్రీకరణ గురించి తెలియదని ఆయన అన్నారు. అదే కనుక నిజమైతే కచ్చితంగా షూటింగ్‌ చేయటం తప్పేనన్నారు. సోమవారం జరిగిన చిత్రీకరణలపై వివరాలు సేకరిస్తానన్నారు. 



ఫెడరేషన్‌ సపోర్ట్‌ కావాలని అడిగారు: అనిల్‌(Anil)

ఫిల్మ్‌ ఛాంబర్‌ షూటింగ్‌లు బంద్‌ చేయాలని నిర్ణయించింది. దీనికి ఫెడరేషన్‌ సపోర్ట్‌ కావాలని అడిగారు. మేం అధికారిక లేఖ అడిగాము. ఛాంబర్‌ నిర్ణయానికి ఫెడరేషన్‌ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఛాంబర్‌ నుంచి లేఖ రాకపోవడంతో సోమవారం చిత్రీకరణలు జరిగాయి. మంగళవారం జరగబోయే కమిటీ మీటింగ్‌లో ఇతర విషయలు చర్చించడం జరుగుతుంది’’ అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ అన్నారు. 


దిల్‌ రాజు కట్టుబడి ఉండాలి: నట్టికుమార్‌ (nattti kumar)

ఛాంబర్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌లో దిల్‌రాజు చిత్రీకరణలు బంద్‌ అన్నారు. కానీ ప్రస్తుతం 16 సినిమాల  షూటింగ్‌ యఽథావిధిగా కొనసాగుతున్నాయి. అందులో బైలింగ్వల్‌ చిత్రాలూ ఉన్నాయి. ఆ చిత్రాలకు పని చేసేది తెలుగు సాంకేతిక నిపుణులే! దిల్‌ రాజు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. కాబట్టి అందరూ చిత్రీకరణలు ఆపాల్సిందే’’ అని నట్టి కుమార్‌ అన్నారు. 








Updated Date - 2022-08-01T22:47:54+05:30 IST