F4 కు ప్లాన్ మారుతోందా?

ABN , First Publish Date - 2022-05-29T18:34:42+05:30 IST

విక్టరీ వెంకటేశ్ (venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన వినోదాల జల్లు ‘ఎఫ్ 3’ (F3). సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2) చిత్రానికిది సీక్వెల్ అయినప్పటికీ, మొదటి భాగం నటీనటులనే కంటిన్యూ చేస్తూ మరో సరికొత్త కథతో చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. అప్పట్లో సంక్రాంతి అల్లుళ్ళుగా సందడి చేసిన వెంకీ, వరుణ్ లు ఈ సారి సమ్మర్ సోగ్గాళ్లుగా వినోదాన్ని పంచారు.

F4 కు ప్లాన్ మారుతోందా?

విక్టరీ వెంకటేశ్ (venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన వినోదాల జల్లు ‘ఎఫ్ 3’ (F3). సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2) చిత్రానికిది సీక్వెల్ అయినప్పటికీ, మొదటి భాగం నటీనటులనే కంటిన్యూ చేస్తూ మరో సరికొత్త కథతో చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. అప్పట్లో సంక్రాంతి అల్లుళ్ళుగా సందడి చేసిన వెంకీ, వరుణ్ లు ఈ సారి సమ్మర్ సోగ్గాళ్లుగా వినోదాన్ని పంచారు. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కాసుల వర్షం కురిపిస్తోంది. సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవడంతో దీనికి మూడో భాగం కూడా ఉండబోతోందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకీ, వరుణ్‌లు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక బస్ డ్రైవర్ అవతారం ఎత్తిమరీ మూడో భాగంపై హింటిచ్చాడు. దీంతో ‘ఎఫ్ 4’ (F4) పై మరింత ఆసక్తి నెలకొంది.  


అయితే ‘ఎఫ్ 4’ విషయంలో ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. అదేంటంటే..  మూడో భాగం విషయంలో నిర్మాత దిల్ రాజు (Dil Raju), దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్లాన్ తో ఉన్నారట. నిజానికి ‘ఎఫ్ 3’ చిత్రాన్ని వేరే కేస్టింగ్ తో చేయాలనుకున్నారట. అయితే మొదటి భాగానికి వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకొని అదే మ్యాజిక్ ను కంటిన్యూ చేయాలనుకున్నారట. దాంతో మొదటి భాగానికి మించిన రెమ్యూనరేషన్ తో వారినే రెండో భాగంలో  కంటిన్యూ చేయాల్సి వచ్చిందట.  అందుకే ‘ఎఫ్ 4’ విషయంలో బడ్జెట్ ను తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారని టాక్. అంటే మూడో భాగంలో నటీనటులు వేరే ఉండబోతారని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అయితే తొలి రెండు భాగాల్లోనూ అభిమానుల్ని మెప్పించే నటనను ప్రదర్శించిన వెంకీ, వరుణ్‌లకు ప్రత్యామ్నాయంగా వేరే హీరోలు ఎవరు ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ విషయంలో అనిల్ రావిపూడి ఆలోచన ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోందట. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-05-29T18:34:42+05:30 IST