Salaar : సెట్స్ నుంచి మరో ఫోటో లీక్..

ABN , First Publish Date - 2022-05-26T20:28:09+05:30 IST

‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ గా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు రాబట్టిన ‘కేజీయఫ్ 2’ చిత్రం గత రికార్డుల్ని తిరగరాసింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) తాజా చిత్రం ‘సలార్’ (Salaar) ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Salaar : సెట్స్ నుంచి మరో ఫోటో లీక్..

‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ గా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు రాబట్టిన ‘కేజీయఫ్ 2’ చిత్రం గత రికార్డుల్ని తిరగరాసింది.  ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) తాజా చిత్రం ‘సలార్’ (Salaar) ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ నుండి గతంలో ఒక ప్రభాస్ స్టిల్ లీక్ అయ్యింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆరడుగుల కటౌట్‌తో ఉన్న ప్రభాస్ క్యాజువల్‌ లుక్  టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ ఫోటోని చూసిన ప్రభాస్ ఫాన్స్... ‘కేజీయఫ్ 2’ నే తలదన్నే రీతిలో మాస్ గా ఉందంటూ..  సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. 


తాజాగా సలార్ (Salaar) సెట్స్ నుంచి మరో పిక్ లీకయింది. ప్రభాస్ ఒక అమ్మాయి ముందు నిలబడి మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫాన్స్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి శ్రుతి హసన్ (Shruthi Haasan) అయి ఉంటుంది అనుకుంటున్నారు. ఫోటోలో ఉన్న ఫిజిక్ అండ్ స్టాండింగ్ స్టైల్ చూస్తే ఆమె శ్రుతి హసన్ లాగానే  కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సలార్ నుంచి లీక్స్ బయటకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సలార్ సెట్స్ నుంచి ప్రభాస్(Prabhas) ఫైట్ సీన్స్ కూడా లీక్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఫొటోస్ ప్రభాస్ ఫాన్స్ లో జోష్ నింపాయి. ఇప్పటికే 40శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘సలార్’ సినిమాను అక్టోబర్ లోపు కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ డ్యూయల్ రోల్ లేదా డ్యూయల్ షేడ్ ఉన్న రోల్ లో నటిస్తున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ మూవీ... ప్రభాస్ అభిమానులు చెప్తున్నట్లు, ‘కేజీఎఫ్ 2’ (KGF2) రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Updated Date - 2022-05-26T20:28:09+05:30 IST