Puri Jagannath : ఇతర హీరోల అభిమానుల గుండెలు గుభేల్..

ABN , First Publish Date - 2022-08-29T15:44:07+05:30 IST

ఒక్క హిట్ పది ఫ్లాపులకు సమాధానం చెబుతుంది. అదే ఒక ఫ్లాప్ వస్తే మాత్రం అందరూ దానికి సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్లాప్ దెబ్బతిన్న దర్శకుడు.. నెగెటివ్ సెంటిమెంట్‌కు పర్యాయ పదమైపోతాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడి పరిస్థితి అలాగే ఉంది.

Puri Jagannath : ఇతర హీరోల అభిమానుల గుండెలు గుభేల్..

ఒక్క హిట్ పది ఫ్లాపులకు సమాధానం చెబుతుంది. అదే ఒక ఫ్లాప్ వస్తే మాత్రం అందరూ దానికి సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్లాప్ దెబ్బతిన్న దర్శకుడు.. నెగెటివ్ సెంటిమెంట్‌కు పర్యాయ పదమైపోతాడు. ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath)  పరిస్థితి అలాగే ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బ్లాక్ బస్టర్ అయినప్పటికీ పూరీ ఫామ్‌పై చాలా మందికి సందేహాలు పోలేదు. అంతకు ముందు ఆయన ఇచ్చిన డిజాస్టర్లు అలాంటివి మరి. అందుకే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో పూరీ సినిమా తీస్తున్నాడనగానే అతడి అభిమానుల్లో చాలా మందికి గుబులు మొదలైంది. కానీ విజయ్ అదేమీ పట్టించుకోకుండా.. పూరీ అంతటి వాడు తనకు ఛాన్స్ ఇచ్చాడు అనే ట్రాన్స్‌లో ‘లైగర్’ (Liger)  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 


‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ చిత్రాలు.. విజయ్ దేవరకొండ స్థాయిని అమాంతం పెంచేశాయి. అతడి కెరీర్ మొత్తం మీద ఈ మూడే చెప్పుకోదగ్గ చిత్రాలు. అయినప్పటికీ..  వాటి వల్ల అతడికొచ్చిపడిన క్రేజ్ మాత్రం బోలెడంత. అయితే ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాలు డిజాస్టర్లయినప్పటికీ.. అతడి ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు సరిగదా.. ‘లైగర్’ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చిపడింది. ఈ సినిమాకి తన కెరీర్ లో ఎప్పుడూ పడని కష్టం పడ్డాడు విజయ్. అత్యధిక సమయమూ కేటాయించాడు. కట్ చేస్తే అతడు పెట్టిన ఎఫెర్ట్ అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైందని అభిమానులు గోల పెడుతున్నారు. పూరీతో సినిమా వద్దని చిలక్కి చెప్పినట్టు చెబితే విన్నావా? అంటూ విజయ్‌ను అభిమానులు నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ ఎపిసోడ్  ఫామ్ కోల్పోయిన దర్శకుల్ని చేరదీసిన  హీరోల అభిమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. 


ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానుల టెన్షన్ మామూలుగా లేదు. ఆయన సినిమాల లైనప్ విషయంలో అభిమానుల్లో చాలా అసంతృప్తి కనిపిస్తోంది. పూరీ లాంటి తోపు దర్శకుడే.. ఇప్పుడు ఫ్లాపు నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాంటిది తన కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేకుండా ఇప్పటిదాకా దర్శకుడిగా నెట్టుకొచ్చిన మెహర్ రమేశ్ (Meher Ramesh) దర్శకత్వంలో చిరు ‘భోళాశంకర్’ (Bhola Shankar) చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు తమకు మోహర్ ఎలాంటి అనుభవం మిగుల్చుతాడో అని మెగాస్టార్ అభిమానుల్లో కంగారు మామూలుగా లేదు. ‘బిల్లా, కంత్రి, శక్తి, షాడో’ లాంటి రెండు పదాల టైటిల్స్‌తో భీభత్సమైన ఫ్లాప్స్ అందుకున్న మెహర్ రమేశ్ దర్శకత్వంలో సినిమా వద్దంటూ చిరును చాలా మంది అభిమానులు వేడుకున్నారు. అయితే చిరు.. అతడి స్ర్కిప్ట్ ను అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయలేదు. తనకు పూర్తి సంతృప్తినిచ్చే వరకూ కరెక్షన్స్ చెబుతూనే ఉన్నారు. చివరికి అది పెర్ఫెక్ట్ గా లాక్ అయిన తర్వాతనే మెహర్ తో సినిమాకు ప్రొసీడ్ అయ్యారు. 


అలాగే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ’ లాంటి ఫ్లాప్స్ తీసిన బాబీ (Bobby) దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విషయంలోనూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దానికి తోడు  బాబీ కథాంశాలన్నీ ఔట్ డేటెట్‌గా ఉంటాయని ఈ సినిమా విషయంలో కూడా అంచనాలు తల్లకిందులవుతాయని భయపడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. ప్రభాస్, మారుతి సినిమా విషయంలోనూ అభిమానులు తెగ వర్రీ అయిపోతున్నారు. శైలజారెడ్డి అల్లుడు, పక్కా కమర్షియల్ లాంటి పక్కా ఫ్లాప్స్ తీసిన మారుతి (Maruthi) టాలెంట్ మీద కూడా ఎవరికీ నమ్మకం లేదు. ఈ సినిమా వస్తోందని తెలిసిన దగ్గర నుంచి ప్రభాస్‌ (Prabhas) కు అభిమానుల నుంచి  సినిమా చేయొద్దనే రిక్వెస్టులు వస్తునే ఉన్నాయి.  అయినప్పటికీ.. మారుతి చెప్పిన హారర్ కథాంశం తన కెరీర్ కు కాస్తంత రిలాక్సేషన్ అవుతుందని ప్రభాస్ భావించాడట. మరి మిగతా దర్శకులు హిట్స్ అందుకుంటారో లేక పూరీ బాటే పడతారో చూడాలి. 

Updated Date - 2022-08-29T15:44:07+05:30 IST