Ram - Boyapati movie : మరో హీరో నటిస్తున్నాడా?

ABN , First Publish Date - 2022-06-27T14:28:22+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati srinu) కలయికలో ఓ సినిమా ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది.

Ram - Boyapati movie : మరో హీరో నటిస్తున్నాడా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati srinu) కలయికలో ఓ సినిమా ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మాస్ మల్టీస్టారర్ గా తీర్చిదిద్దడానికి దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని టాక్. అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan). ఆల్రెడీ శివకార్తికేయన్.. ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) ఫేమ్  అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో ‘ప్రిన్స్’ (Prince) అనే డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


రామ్ బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. గతేడాది ‘అఖండ’ (Akhanda) చిత్రంతో బోయపాటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ప్రస్తుతం లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో ‘ది వారియర్’ (The Warrior) అనే కాప్ స్టోరీలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కంప్లీట్ అయ్యాకా.. బోయపాటి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.  అసలే ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్.. బోయపాటి లాంటి పక్కా మాస్ డైరెక్టర్ చేతిలో పడితే.. ఆ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించొచ్చు. 


ఆల్రెడీ రామ్.. హిందీ డబ్బింగ్ చిత్రాలతో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాడు. అతడు నటించిన ప్లాప్ చిత్రాలకు సైతం రికార్డు వ్యూస్ రావడం గమనార్హం. ఆ క్రేజ్ తోనే బోయపాటి .. ఈ సినిమాను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా ప్రచారం చేయబోతున్నారని వినికిడి. అతి త్వరలో మిగిలిన కేస్టింగ్ ను ప్రకటించి.. చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్టు టాక్. మరి ఈ సినిమాలో శివకార్తికేయన్ (Shivakarthikeyan) నిజంగానే నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-06-27T14:28:22+05:30 IST