మరో ఫ్యామిలీ డ్రామా

ABN , First Publish Date - 2022-05-24T06:06:12+05:30 IST

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్స్‌... బొమ్మరిల్లు భాస్కర్‌. ఆయన కథలన్నీ ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటాయి...

మరో ఫ్యామిలీ డ్రామా

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్స్‌... బొమ్మరిల్లు భాస్కర్‌. ఆయన కథలన్నీ ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటాయి. ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారాయన. ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. ఫ్యామిలీ డ్రామాలకు చైతన్య చక్కగా సరిపోతారు. అందుకే ఈ కాంబోపై ఆసక్తి మొదలైపోయింది. ప్రస్తుతం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘ధ్యాంక్యూ’ అనే చిత్రం చేశారు చైతూ. త్వరలోనే విడుదల కానుంది. బుధవారం ‘ధ్యాంక్యూ’ ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. అమీర్‌ ఖాన్‌తో కలిసి ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించారు చైతూ. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇవన్నీ అయ్యాకే... భాస్కర్‌ చిత్రం పట్టాలెక్కవచ్చు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశాలున్నాయి. 


Updated Date - 2022-05-24T06:06:12+05:30 IST