Viral Video: Franceలో బాలీవుడ్ నటుడి వస్తువులు చోరీ.. జాగ్రత్తగా ఉండాలంటూ..

ABN , First Publish Date - 2022-06-23T14:51:00+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ (Annu Kapoor) ప్రస్తుతం యూరప్‌ టూర్‌లో చేస్తున్నారు...

Viral Video: Franceలో బాలీవుడ్ నటుడి వస్తువులు చోరీ.. జాగ్రత్తగా ఉండాలంటూ..

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ (Annu Kapoor) ప్రస్తుతం యూరప్‌ టూర్‌లో చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ప్యారిస్ (Paris) సమీపంలో డిజోన్ వీల్లెలోని రెల్వే స్టేషన్‌కి వెళ్లగా అక్కడ ఆయన బ్యాగ్ చోరీకి గురైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సీనియర్ నటుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ట్రైన్ ఎక్కేటప్పుడు కొందరు వ్యక్తులు నాకు సహాయం చేయడానికి వచ్చి ఆయన విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు.


ఒక నిమిషం ఉన్న వీడియోలో అన్నూ కపూర్ మాట్లాడుతూ.. ‘చాలా డబ్బు, ఐప్యాడ్, డైరీ, క్రెడిట్ కార్డ్ ఇతర వస్తువులు ఉన్న నా బ్యాగ్‌ని కొందరు వ్యక్తులు దొంగిలించారు. కాబట్టి ఫ్రాన్స్‌(France)లో ప్రయాణించేటప్పుడు పిక్ పాకెటర్స్, నిజాయతీ లేని వ్యక్తులు, దొంగలు ఉన్నందున అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన హెచ్చరించారు. ఆ వీడియోని రికార్డు చేస్తున్న సమయంలో ఆయన ట్రైన్‌లోనే ఉన్నట్లు కెమెరాలో తెలుస్తోంది.


అన్నూ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను పారిస్ చేరుకున్న తర్వాత, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇక్కడ రైల్వే అధికారులు అక్కడి వరకూ నాతో వస్తామని తెలిపారు. మీరు ఫ్రాన్స్‌కు వచ్చినప్పుడు ఇక్కడ దొంగల ఉన్నారని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఇది నాకు చాలా పెద్ద విషాదం. కానీ.. నా పాస్‌పోర్ట్ ఉండడంతో కొంచెం సేఫ్ అయ్యాను. దేవునికి ధన్యవాదాలు. అయితే.. నేను నా క్రెడిట్ కార్డ్, నగదును పోగొట్టుకున్నాను. మీలో చాలామంది ఫ్రాన్స్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.


ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అన్నూ కపూర్.. ‘నేను యూరప్ పర్యటనలో ఉన్నాను. నా గాడ్జెట్లు, విలువైన వస్తువులు ఉన్న నా బ్యాగ్‌ ఫ్రాన్స్‌లో చోరీకి గురైంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఫ్రాన్స్ టూరిజం, ఫ్రాన్స్ పోలీసులు, పారిస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.



Updated Date - 2022-06-23T14:51:00+05:30 IST