‘మాచర్ల’లో అంజలి మాస్‌ గీతం

ABN , First Publish Date - 2022-07-04T07:17:36+05:30 IST

అచ్చమైన తెలుగింటి అమ్మాయి అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఎంత పద్ధతిగా కనిపించారో? అలాంటి అంజలి తొలిసారి ఓ మాస్‌, ఐటెమ్‌ గీతం...

‘మాచర్ల’లో అంజలి మాస్‌ గీతం

అచ్చమైన తెలుగింటి అమ్మాయి అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఎంత పద్ధతిగా కనిపించారో? అలాంటి అంజలి తొలిసారి ఓ మాస్‌, ఐటెమ్‌ గీతం చేశారు. నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. కృతిశెట్టి, కేథరిన్‌ థ్రెసా కథానాయికలు. ఎం.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో ఓ ఐటెమ్‌ గీతం ఉంది. అందుకోసం అంజలిని ఎంచుకొన్నారు. ఆదివారం అంజలి లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఇదో మాస్‌, యాక్షన్‌ చిత్రం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అంజలి రాక... ఈ సినిమాకి మరింత గ్లామర్‌ తీసుకొచ్చింది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’న్నారు దర్శక నిర్మాతలు. సంగీతం: మహతి స్వర సాగర్‌.

Updated Date - 2022-07-04T07:17:36+05:30 IST