Anil Ravipudi : ‘ఎఫ్ 4’ రెడీ అవుతోందా?

ABN , First Publish Date - 2022-05-04T19:48:59+05:30 IST

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలోని పాత్రలనే రెండో భాగంలోనూ కంటిన్యూచేస్తూ సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాకపోతే రెండో భాగంలో సునీల్‌తో సహా మరికొన్ని పాత్రలు ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి.

Anil Ravipudi : ‘ఎఫ్ 4’ రెడీ అవుతోందా?

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలోని పాత్రలనే రెండో భాగంలోనూ కంటిన్యూచేస్తూ సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాకపోతే రెండో భాగంలో సునీల్‌తో సహా మరికొన్ని పాత్రలు ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి. మొదటి భాగాన్ని మించిన హిలేరియస్ కామెడీని ‘ఎఫ్ 3’ చిత్రంలో వర్కవుట్ చేస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. మే 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్‌ను జోరుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు వరుణ్ డబ్బింగ్ కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన అతి ముఖ్యమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీ తర్వాత ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందట. 


‘ఎఫ్ 3’ చిత్రం సూపర్ హిట్ అయితే దర్శకుడు Anil Ravipudi ‘ఎఫ్ 4’ తీయడానికి రెడీగా ఉన్నాడని సమాచారం. దిల్ రాజే ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు వినికిడి. అయితే ఈ సినిమా రావడానికి చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ‘ఎఫ్ 3’ తర్వాత Anil Ravipudi ఓ సీనియర్ హీరోతో సినిమా తీయబోతున్నాడు. అలాగే ఇద్దరు, ముగ్గురు  స్టార్ హీరోలకి కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే ‘ఎఫ్ 4’ చిత్రం కార్యరూపం దాల్చే అవకాశాలుంటాయి. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అజేయ దర్శకుడు అనిపించుకొన్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేసి.. వీలైనంత త్వరలో ‘ఎఫ్ 4’ను టేకప్ చేస్తాడని ఆశిద్దాం. 

Updated Date - 2022-05-04T19:48:59+05:30 IST