చేతనైతే నన్ను గుర్తించండి.. ఫ్యాన్స్‌కి బాలీవుడ్ హీరో సవాల్

ABN , First Publish Date - 2022-02-14T19:19:07+05:30 IST

బాలీవుడ్‌లో పాపులారిటీ ఉన్న నటుల్లో అనిల్ కపూర్ ఒకరు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు...

చేతనైతే నన్ను గుర్తించండి.. ఫ్యాన్స్‌కి బాలీవుడ్ హీరో సవాల్

బాలీవుడ్‌లో పాపులారిటీ ఉన్న నటుల్లో అనిల్ కపూర్ ఒకరు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు. అయితే అనిల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జీవితంలో జరిగే ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. 


తాజాగా అనిల్ కపూర్ తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశారు. అది ఆయన మొదటి తరగతి చదివేటప్పుడు స్కూల్‌లో దిగిన ఫొటో. దానికి క్యాప్షన్‌గా.. ‘చెతనైతే నన్ను గుర్తించండి’ రాసుకొచ్చి ఫ్యాన్స్‌కి సవాలు కూడా విసిరాడు. దీంతో ఎంతోమంది ఫ్యాన్స్ ఆయన ఉన్న స్థానాన్ని గుర్తించి కామెంట్స్ చేశారు. 


వారిలో చాలామంది అభిమానులు అనిల్ కపూర్ పైనుంచి మూడో వరుసలో కుడి నుంచి మూడో స్థానంలో ఉన్నాడని నమ్ముతున్నారు. ఆయన ఎక్కువగా గడ్డంతో ఫ్యాన్స్‌కి కనిపిస్తూ ఉంటారు. అందుకే కొందరు ఫ్యాన్స్ ’గడ్డం లేకుండా మిమ్మల్ని గుర్తు పట్టడం కష్టంగా ఉంది సర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఆ పిక్‌లో అనిల్ కపూర్ ఎక్కడ ఉన్నారో మీరు గుర్తు పట్టగలరేమో ప్రయత్నించండి..



Updated Date - 2022-02-14T19:19:07+05:30 IST