Anil Kapoor: హీరోగానే మరికొంతకాలం కొనసాగొచ్చు.. కానీ పరిస్థితులు నన్ను..

ABN , First Publish Date - 2022-04-26T18:14:56+05:30 IST

బాలీవుడ్‌లో 1980, 1990ల్లో ఓ వెలుగు వెలిగిన నటుల్లో అనిల్ కపూర్ ఒకరు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి హిట్ సాధించడంతో ఫ్యాన్ ఫాలోయింగ్..

Anil Kapoor: హీరోగానే మరికొంతకాలం కొనసాగొచ్చు.. కానీ పరిస్థితులు నన్ను..

బాలీవుడ్‌లో 1980, 1990ల్లో ఓ వెలుగు వెలిగిన నటుల్లో అనిల్ కపూర్ ఒకరు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి హిట్ సాధించడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే.. 1990ల చివరికి వచ్చేసరికి ఈ నటుడి క్రేజ్‌లో కొంచెం మార్పు వచ్చింది. దీంతో 2000 నుంచి సినీయర్ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం ప్రారంభించాడు. కొడుకు హర్షవర్థన్ కపూర్‌తో కలిసి అనిల్ చేస్తున్న తాజా చిత్రం ‘థార్’. ఈ మూవీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


అనిల్ మాట్లాడుతూ.. ‘నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక ముందే చాలామంది నన్ను 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఆగమని చెప్పారు. నిజానికి నేను 6 లేక 7 సంవత్సరాల వరకు హీరోగానే ఉండొచ్చు. అయితే ఓ యంగ్ హీరో బాధ్యతలను నేనే మోయలేనని భావించా. అందుకే నా అంతటా నేనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా ఆలోచించాను. అందుకే ప్రస్తుతం ఇక్కడ ఉండగలిగాను. అంతేకాకుండా దిల్ దడ్కనే దోలో ప్రియాంక చోప్రా తండ్రిగా నటించమని నా కొడుకు హర్షవర్థన్ నన్ను ప్రొత్సహించాడు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-26T18:14:56+05:30 IST