ప్రముఖ టీవీ యాంకర్‌కి లక్కీఛాన్స్‌!

ABN , First Publish Date - 2022-03-01T01:58:33+05:30 IST

‘మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నిజమే... సుందర్‌ సి చిత్రంలో జాయిన్‌ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. హ్యాండ్‌సమ్‌ హీరోలు జీవా, జైలతో కలిసి పనిచేస్తున్నాను’ అని పేర్కొంటూ..

ప్రముఖ టీవీ యాంకర్‌కి లక్కీఛాన్స్‌!

ప్రముఖ టీవీ యాంకర్‌ దివ్య దర్శిని (డిడి)కి లక్కీఛాన్స్‌ వరించింది. ఇప్పటివరకు టీవీ షోలకే పరిమితమైన ఈ అందాల ముద్దుగుమ్మ ఇపుడు సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి ‘అరణ్మనై-3’ తర్వాత మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. జనవరి నెలాఖరు నుంచి ఊటీలో షూటింగ్‌ ప్రారంభమై, నెల రోజులుగా నిరంతరాయంగా సాగుతుంది. ఈ చిత్రానికి నటి ఖుష్బూ నిర్మాత. ఇందులో దివ్య దర్శినికి అవకాశం దక్కింది. 


ఒక ప్రధాన పాత్రకు ఆమెను దర్శకుడు సుందర్ సి ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఇదే విషయాన్ని డీడీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నిజమే... సుందర్‌ సి చిత్రంలో జాయిన్‌ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. హ్యాండ్‌సమ్‌ హీరోలు జీవా, జైలతో కలిసి పనిచేస్తున్నాను’ అని పేర్కొంటూ వారితో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేసింది. కాగా,ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. 

Updated Date - 2022-03-01T01:58:33+05:30 IST