Anasuya: ఆ ‘అమ్మ’ ట్వీట్.. ‘లైగర్’ రిజల్ట్ గురించేనా?

ABN , First Publish Date - 2022-08-26T00:19:22+05:30 IST

యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya).. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆమె పోస్ట్‌పై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ ఫైర్

Anasuya: ఆ ‘అమ్మ’ ట్వీట్.. ‘లైగర్’ రిజల్ట్ గురించేనా?

యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya).. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆమె పోస్ట్‌పై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె చేసిన పాత్రలను బయటికి తీస్తూ.. ఇది నీ చరిత్ర అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలింతకీ అనసూయ ఏమని ట్వీట్ చేసిందంటే.. ‘‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored’’ అని. 


‘‘ఇంకొకరు బాధపడుతుంటే సంతోషపడాలని అనుకోవడం లేదు కానీ.. నమ్మకం నిజమైంది..’’ అని ఆమె కచ్చితంగా ‘లైగర్’ (Liger) రిజల్ట్‌ని చూసే ఈ ట్వీట్ చేసిందని విజయ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా టైమ్‌లో అందులోని ఓ డైలాగ్‌ని టార్గెట్ చేస్తూ అనసూయ కొన్ని ట్వీట్స్ సంధించింది. ఆ సమయంలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్‌తో హర్టయిన అనసూయ కొన్నాళ్లు సోషల్ మీడియాకి కూడా దూరమైంది. మరి దానిని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేసిందో.. లేదంటే వేరే ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. అసలే ‘లైగర్’ నిరాశలో ఉన్న విజయ్ అభిమానులకు మాత్రం.. ఆమె తమ హీరోనే టార్గెట్ చేసిందనేలా అనసూయ ట్వీట్ వెళ్లిపోయింది. దీంతో.. విజయ్ అభిమానులు ఇష్టం వచ్చినట్లుగా ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ ట్రెండ్ అవడమే కాకుండా.. అనేకానేక చర్చలకు తావిస్తోంది.



Updated Date - 2022-08-26T00:19:22+05:30 IST