Anasuya: ‘దర్జా’గా భయపెడతాను.. భయపడండి

ABN , First Publish Date - 2022-07-19T22:28:20+05:30 IST

ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ నేను భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు..

Anasuya: ‘దర్జా’గా భయపెడతాను.. భయపడండి

‘‘ ‘దర్జా’ (Darja) సినిమాలో ప్రేక్షకులను భయపెట్టడానికి ప్రయత్నించాను.. దయచేసి భయపడటానికి ప్రయత్నం చేయండి’’ అని అన్నారు యాంకర్, నటి అనసూయ (Anasuya). ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దర్జా’. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) సమర్పలో పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్ నగరంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన నవీన్ ఎర్నేని లాంఛ్ చేసి.. చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు. ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu), కరీంనగర్ సీపీ సత్యన్నారాయణ, ‘గంధర్వ’ (Gandharwa) చిత్ర హీరో సందీప్ మాధవ్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని.. చిత్రం ఘన విజయం సాధించాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ.. ‘‘ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పాలి. అల్లు అరవింద్‌గారు, వెంకటేష్‌గారు, సురేష్‌బాబుగారు, రాఘవేంద్రరావుగారు, నవీన్ ఎర్నేనిగారు, బుచ్చిమాయ్య.. వీరంతా ‘దర్జా’ టీమ్‌కు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ నేను భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. నేను షకీల్‌గారిని సంగీత దర్శకుడు అని అనుకోలేదు.. నిర్మాత అనుకున్నాను. ఎందుకంటే ప్రతీది తను దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిగారు ఒక బ్యాంకర్‌లా కనిపించేవారు. ఈ పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలైన బ్రదర్స్ శివశంకర్‌గారు, రవిగారు సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. వారెంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే కామినేని శ్రీనివాస్‌గారు ఎంతో సపోర్ట్ ఇస్తూ వచ్చారు. దర్శకుడు మాక్.. ఎప్పుడూ కంగారుగా ఉండేవారు. ఇప్పుడు కాస్త వైట్ డ్రస్సులో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. ఇది అద్భుతమైన సినిమా. ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకుండా.. అందరూ థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. జూలై 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది..’’ అని అన్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు.

Updated Date - 2022-07-19T22:28:20+05:30 IST