అవసరమైతే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటాను : అనసూయ

ABN , First Publish Date - 2021-11-10T22:47:35+05:30 IST

అటు బుల్లితెరపై హాట్ యాంకర్ గానూ, ఇటు వెండితెరపై ప్రత్యేక పాత్రల్ని పోషిస్తూ సత్తా చాటుకుంటున్నారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అనసూయ .. బన్నీ, సుక్కూ కాంబో మూవీ ‘పుష్ప’ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ‘

అవసరమైతే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటాను : అనసూయ

అటు బుల్లితెరపై హాట్ యాంకర్ గానూ, ఇటు వెండితెరపై ప్రత్యేక పాత్రల్ని పోషిస్తూ సత్తా చాటుకుంటున్నారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అనసూయ .. బన్నీ, సుక్కూ కాంబో మూవీ ‘పుష్ప’ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ‘రంగస్థలం’ సినిమా తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో పేరు తెచ్చే సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా అనసూయ తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. అందులో భాగంగా .. ‘ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లో మీరు గుండుతో నటిస్తారా?’ అంటూ అనసూయని ఓ అభిమాని  అడిగాడు. 



దానికి అనసూయ ఎలాంటి మొహమాటం లేకుండా.. పెద్ద సినిమా అయి ఉండి అందులో నా పాత్రకి మంచి ప్రధాన్యత ఉంటే.. తప్పకుండా గుండు తో కనిపిస్తానని చెప్పి షాకిచ్చారు. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో అనసూయ తను కోరుకునే విధంగానే ప్రధాన్యత కలిగిన పాత్రలో నటిస్తున్నారు. అందులో ఆమె పేరు దాక్షాయణి. వెరైటీ చీర కట్టులో.. తంబాకు నములుతూ.. వక్కలు కట్ చేసే లుక్ లో అనసూయ కనిపించారు. దీంతో ఇందులో అనూది కీలక పాత్ర అని అర్ధమవుతోంది. ఈ రోజే (బుధవారం) విడుదలైన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-11-10T22:47:35+05:30 IST