మళ్ళీ విలన్‌గా Anasuya Bharadwaj ?

ABN , First Publish Date - 2022-07-17T18:21:34+05:30 IST

బుల్లితెర క్రేజీ యాంకర్, వెండితెర విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. తాజాగా నటిస్తు్న్న చిత్రం ‘దర్జా’ (Darja). సునీల్ (Suneel) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ (Saleem Malik) దర్శకత్వంలో తెరకెక్కింది.

మళ్ళీ విలన్‌గా Anasuya Bharadwaj ?

బుల్లితెర క్రేజీ యాంకర్, వెండితెర విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. తాజా చిత్రం ‘దర్జా’ (Darja). సునీల్ (Suneel) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ (Saleem Malik) దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇటీవలే షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలకు ముంగిట నిలిచిన ఈ సినిమాకు సంబంధించిన ఓ సీక్రెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..  ఇందులో అనసూయ పూర్తి స్థాయిలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటిస్తోందట. 


ఆల్రెడీ అనసూయ ఇంతకు ముందు ‘క్షణం’ (Kshanam) సినిమాలో తొలిసారిగా విలన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో విలన్ మంగళం శ్రీను భార్యగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రతో అలరించింది. ఇప్పుడు మరోసారి ‘దర్జా’ చిత్రంలో అలాంటి పాత్రనే చేయనుండడం గమనార్హం.  ఈ సినిమాలో ఇంకా  షమ్ము, అరుణ్ వర్మ, శిరీష, ఆమని, పృధ్వి, అక్సా ఖాన్, షకలక శంకర్,  మిర్చీ హేమంత్, ఛత్రపతి శేఖర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ (Rap Rock Shakeel) సంగీతం అందిస్తుండగా, రాజేంద్రకుమార్ (Rajendrakumar), నజీర్ (Naseer), భవానీ ప్రసాద్ (Bhavani Prasad) సంభాషణలు రాస్తున్నారు. 


ఈ సినిమాతో పాటు అనసూయ.. త్వరలో ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో తన పాత్రను కంటిన్యూ చేయబోతోంది. అలాగే కృష్ణవంశీ (Krishna Vamshi) ‘రంగమార్తాండ’ (Rangamarthanda) లో కీలక పాత్ర చేస్తోంది. ఇంకా ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర చేయబోతోంది. ఇంకా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలోనూ అనసూయ నటిస్తోంది. ‘క్షణం, పుష్ప’ చిత్రాల్లో ఆమె విలనిజం ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. మరి ‘దర్జా’ లో ఆమె నటన ఇంకే స్థాయిలో ఉండనుందో చూడాలి. 

Updated Date - 2022-07-17T18:21:34+05:30 IST