Anasuya Bed post: ఇంట్లో ఆయన లేరు.. ఒంటరిగా..

ABN , First Publish Date - 2022-10-07T01:15:38+05:30 IST

తన అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌(Trolling)కు గురవుతుంటారు అనసూయ(Anasuya). తన మీద సెటైర్లు వేసేవారికి ఘాటుగానే కౌంటర్‌ ఇస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్‌ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యేలా చేసింది.

Anasuya Bed post: ఇంట్లో ఆయన లేరు.. ఒంటరిగా..

తన అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌(Trolling)కు గురవుతుంటారు అనసూయ(Anasuya). తన మీద సెటైర్లు వేసేవారికి  ఘాటుగానే కౌంటర్‌ ఇస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్‌ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యేలా చేసింది. ఇటీవల అనసూయ బెడ్‌ మీద పడుకుని ఓ వీడియో పోస్ట్‌ చేశారు. దానికి ఓ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు. అనసూయ భర్త భరద్వాజ్‌ అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌ అట. ఆయన పక్కన లేకుండా నిద్రలోకి జారుకోవడం కష్టంగా ఉందని బాధపడుతున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ తనకు తానే గుడ్‌ నైట్‌ చెప్పుకున్నారు. 


‘‘నా ఇడియట్‌ (భర్త పేరు ట్యాగ్‌ చేసి) ఊళ్లో లేని సమయంలో బెడ్‌పైకి (anasuya bed post)ఒంటరిగా వెళ్లడానికి ముందు నాకు నేను ముచ్చట్లు చెప్పుకుంటాను. ఆయనంటే నాకు పిచ్చి ప్రేమ’’ అని అనసూయ రాసుకొచ్చారు. అయితే దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘భర్తను ఇడియట్‌ అని సంబోధించిన మీ సంస్కారానికి హాట్సాఫ్‌’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేస్తే.. నీ భర్త ఇంట్లో లేడని అందరికీ తెలియాలా? అని మరికొందరు మండిపడుతున్నారు. భర్తను ఇడియట్‌ అంటున్నావ్‌.. నిన్ను ఆంటీ అంటే తప్పా’ అని ట్రోల్‌ చేస్తున్నారు. 




Updated Date - 2022-10-07T01:15:38+05:30 IST