టెంప్ట్ చేస్తున్న లైగర్ బ్యూటీ..!

ABN , First Publish Date - 2021-12-09T17:39:09+05:30 IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌తో కుర్రాళ్ళను బాగా టెంప్ట్ చేస్తోంది. బాలీవుడ్ పాపులర్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే 'లైగర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

టెంప్ట్ చేస్తున్న లైగర్ బ్యూటీ..!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌తో కుర్రాళ్ళను బాగా టెంప్ట్ చేస్తోంది. బాలీవుడ్ పాపులర్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే 'లైగర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ మూవీ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయిందట. పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్‌తో పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యారస్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న అనన్య పాండే సోషల్ మీడియాలోనూ బాగా సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్ పిక్స్ షేర్ చేసి హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని దిగిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన యూత్ రక రకాల కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. 

Updated Date - 2021-12-09T17:39:09+05:30 IST