ఫోటోలు షేర్ చేసిన ‘లైగర్’ భామ.. విక్యాట్ పెళ్లిపై ఫన్నీ కామెంట్

ABN , First Publish Date - 2021-12-10T18:42:06+05:30 IST

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సాధించింది అనన్య పాండే. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’తో తెలుగుతో పాటు ఇతర సౌతిండియా భాషలకి పరిచయమవుతోంది...

ఫోటోలు షేర్ చేసిన ‘లైగర్’ భామ.. విక్యాట్ పెళ్లిపై ఫన్నీ కామెంట్

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సాధించింది అనన్య పాండే. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’తో తెలుగుతో పాటు ఇతర సౌతిండియా భాషలకి పరిచయమవుతోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.


తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ 2021 అవార్డుల ఫంక్షన్‌లోని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనన్య. పింక్ కలర్‌లో ఉన్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటికి ‘నాలాగే అందరూ కత్రినా, విక్కీ పెళ్లి ఫోటోల గురించి ఎదురుచూస్తున్నారని తెలుసు. అయినా హాయ్ ఫిల్మ్ ఫేర్ అవార్ట్స్’ అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది.


ఈ వైరల్ ఫోటోలపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతోమంది అభిమానులు కామెంట్స్ పెట్టారు. ‘హాలో క్యూటీ, ఫన్నీ క్యాప్షన్‌’ అంటూ నటుడు మృణాల్ ఠాకూర్.. ‘ఎంతో బావున్నావ్’ అంటూ నీలం కొఠారి కామెంట్స్ చేశారు. ఓ ఫ్యాన్ అయితే ‘కత్రినా, విక్కీ ఫోటోలు షేర్ చేయలేదు. కనీసం నువ్వైనా పిక్స్ పెట్టావం’టూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఎంతోమంది ఫ్యాన్స్ గట్టిగా నవ్వుతున్న ఎమోజీలతో తమ అభిమానాన్ని తెలియజేశారు.


అయితే అనన్య ప్రస్తుతం ‘లైగర్’తో పాటు జోయా అక్తర్ దర్శకత్వంలో ‘కో గయో హామ్ కహాన్’, శకూన్ బత్రా డైరెక్షన్‌లో ఇంకా పేరు పెట్టని సినిమాలో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.



Updated Date - 2021-12-10T18:42:06+05:30 IST