ఆ సినిమాల్లో నటించడం ఇష్టం లేదంటోన్న విజయ్ దేవరకొండ హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-21T00:18:17+05:30 IST

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా

ఆ సినిమాల్లో నటించడం ఇష్టం లేదంటోన్న విజయ్ దేవరకొండ హీరోయిన్

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. అనంతరం ‘కాలీ పీలీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’ వంటి సినిమాలతో అభిమానులను అలరించింది. తాజాగా అనన్య నటించిన చిత్రం ‘గెహ్రాయియా’. కొన్ని రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీ అభిమానుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజాగా అనన్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


కొత్త తరహా, ఒరిజినల్ కంటెంట్ సినిమాలు చేయడమంటే తనకిష్టమని అనన్య పాండే చెప్పింది. రీమేక్ చిత్రాల్లో నటించడం ఇష్టం లేదని వివరించింది. బాలీవుడ్‌లో రీమేక్ సినిమాలను చేయడానికి అందరూ సుముఖంగా లేరని తెలిపింది. ఈ నిర్ణయం ఆమెకు ఎంతగానో సంతోషం కలిగిస్తుందని వెల్లడించింది. కొత్త తరహా, ప్రయోగాత్మక సినిమాలు బీ టౌన్‌లో వస్తే బాగుంటుందని స్పష్టం చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సౌత్ చిత్రాలను ఎక్కువగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడంపై కూడా ఆమె మాట్లాడింది. ‘‘ప్రేక్షకులకు ఏం కావాలో అక్కడి వారికి బాగా తెలుసు. కొత్త తరహా కథలను చెప్పి వారు స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తారు’’ అని అనన్య పాండే వెల్లడించింది. ప్రస్తుతం అనన్య టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’లో నటిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొడ హీరోగా నటిస్తున్నాడు.

Updated Date - 2022-03-21T00:18:17+05:30 IST