త్వరగా మొదలెడితే... వేగంగా ఎదగొచ్చంటోన్న... ‘లైగర్’ పాప!

ABN , First Publish Date - 2022-03-11T02:44:39+05:30 IST

ప్రస్తుతం దీపికా, ఆలియా లాంటి స్టార్ బ్యూటీస్ తరువాతి వరుసలో ఉంది అనన్య పాండే. 23ఏళ్లకే ఆమె చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంకా నటన పరంగా నిరూపించుకోవాల్సి ఉన్నా తన వయస్సుకి తగ్గ పాత్రలతో గ్లామర్ డాల్‌గా మాత్రం మ్యాజిక్ చేయగలుగుతోంది. అందుకే...

త్వరగా మొదలెడితే... వేగంగా ఎదగొచ్చంటోన్న... ‘లైగర్’ పాప!

ప్రస్తుతం దీపికా, ఆలియా లాంటి స్టార్ బ్యూటీస్ తరువాతి వరుసలో ఉంది అనన్య పాండే. 23ఏళ్లకే ఆమె చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంకా నటన పరంగా నిరూపించుకోవాల్సి ఉన్నా తన వయస్సుకి తగ్గ పాత్రలతో గ్లామర్ డాల్‌గా మాత్రం మ్యాజిక్ చేయగలుగుతోంది. అందుకే, మన షో మ్యాన్ పూరీ జగన్నాథ్ తన ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో అనన్యనే రౌడీ స్టార్‌కి రొమాంటిక్ జోడీగా ఎంచుకున్నాడు. త్వరలో సౌత్ బాయ్స్‌ ముందుకి కూడా రాబోతోంది మిస్ పాండే. ‘లైగర్’తో బాలీవుడ్ దాటి దక్షిణాదిలో కాలుమోపుతోంది ముంబై పాప... 


19 ఏళ్లకే హీరోయిన్ అవ్వటం, గ్లామర్ ప్రపంచంలో ఎదురీదటం గురించి అనన్యని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా... తాను అప్పట్లో తన స్నేహితులకి దూరమైపోయినట్టుగా భావించేదాన్నని ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ బ్యూటీ తెలిపింది. టీనేజ్ కూడా పూర్తి కాకుండానే కెమెరా ముందుకొచ్చిన అనన్య ఫ్రెండ్స్‌కు దూరమై మూవీ సెట్స్‌లో సమయం గడపాల్సి వచ్చేదట. అయితే, ‘వర్క్‌ప్లేస్’ను మించిన ‘టెక్ట్స్ బుక్’ ఏదీ ఉండదని కూడా ఆమె అంటోంది. అక్కడ నేర్చుకునే పాఠాలు గొప్ప ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. అంతే కాదు, వృత్తి జీవితంలోకి త్వరగా అడుగిడితే జీవితంలో వేగంగా ఎదుగుతామని కూడా 5ఏళ్ల పైచిలుకు బాలీవుడ్ ప్రయాణం పూర్తి చేసిన యంగ్ బ్యూటీ అంటోంది... 

Updated Date - 2022-03-11T02:44:39+05:30 IST