Liger: అనన్య పాండేని ఆడేసుకుంటున్న నెటిజనం.. యాక్టింగ్ చేయడానికి కష్టపడుతున్నావా మహాతల్లి అంటూ..

ABN , First Publish Date - 2022-08-26T22:00:37+05:30 IST

దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన టాలీవుడ్ మూవీ ‘లైగర్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన..

Liger: అనన్య పాండేని ఆడేసుకుంటున్న నెటిజనం.. యాక్టింగ్ చేయడానికి కష్టపడుతున్నావా మహాతల్లి అంటూ..

దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన టాలీవుడ్ మూవీ ‘లైగర్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, మైక్ టైసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. అయితే.. రిలీజైన మొదటి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది.


దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి పంచుకుంటూ విమర్శలు చేశారు. ముఖ్యంగా ఓ సీన్‌లో అనన్యపాండే నటన నవ్వు తెప్పించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ సీన్‌లో.. కోపంగా ఉన్న విజయ్ ‘ఐ లవ్ యూ’ అని అరుస్తాడు. దాంతో అనన్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే.. అందులో అనన్య నటన నవ్వుతెప్పించేలా ఉంది. దీంతో ఆమె విమర్శలు చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.


‘అతను ప్రపోజ్ చేస్తున్నప్పుడు అనన్య నిద్ర మత్తులో ఉన్నట్లు ఉంది. ఎమోషనల్ అవాల్సిన సీన్‌ని యాక్టింగ్ క్వీన్ చంపేసింది’ అని ఒకరు.. ‘మగ అర్జున్ కపూర్’ అంటూ మరొకరు.. ఇంకొకరైతే.. ‘ఆ సీన్‌లో అతను ఏమైనా ఆమెని బూతులు ఏమైనా తిట్టడా.. అంతలా బాధపడుతోంది’ అని వెటకారంగా రాసుకొచ్చాడు. ‘నా టూత్ బ్రష్ అనన్య పాండే కంటే మంచి హావాభావాలు పలికిస్తుంది’ , ‘యాక్టింగ్ చేయడానికి కష్టపడుతోంది మహాతల్లి’ అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.













Updated Date - 2022-08-26T22:00:37+05:30 IST