ఆ బిగ్‌బాస్ బ్యూటీతో పోలుస్తూ ‘లైగర్’ భామపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-18T15:23:36+05:30 IST

‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి అనన్య పాండే. అనంతరం మంచి సినిమాలు చేస్తూ..

ఆ బిగ్‌బాస్ బ్యూటీతో పోలుస్తూ ‘లైగర్’ భామపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి అనన్య పాండే. అనంతరం మంచి సినిమాలు చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో తెలుగుతోపాటు అన్ని సౌతిండియన్ భాషల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ బ్యూటీకి మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది. కానీ అప్పుడప్పుడు అది డిజాస్టర్ అయ్యి విమర్శల పాలవుతూ ఉంటుంది. తాజాగా సైతం ఈ భామ అలాంటి పరిస్థతినే ఎదుర్కొంది.


అనన్య తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టిన రోజు పార్టీకి హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఈ బ్యూటీ వేసుకొచ్చిన డ్రెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ షోతో పాపులారిటీ సాధించిన ఉర్ఫీ జావేద్‌తో అనన్యని పోలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చెత్త ఫ్యాషన్ సెన్స్ ఎక్కడ చూడలేదంటూ విమర్శలు చేస్తున్నారు. లైగర్ భామ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-03-18T15:23:36+05:30 IST