కరణ్ జోహార్ పార్టీలో ‘లైగర్’ బ్యూటీ డ్రస్ ఉందీ చూశారూ.. వీడియో వదిలిన ఛార్మీ

ABN , First Publish Date - 2022-03-19T02:47:24+05:30 IST

బాలీవుడ్‌లో జరిగిన ఓ పార్టీలో ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే వేసుకున్న డ్రస్‌పై ఇప్పుడు రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. బికినీ తరహా డ్రస్సులో ఆమె పార్టీకి హాజరైంది అంటూ.. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ కూడా మొదలెట్టారు. వివరాల్లోకి..

కరణ్ జోహార్ పార్టీలో ‘లైగర్’ బ్యూటీ డ్రస్ ఉందీ చూశారూ.. వీడియో వదిలిన ఛార్మీ

బాలీవుడ్‌లో జరిగిన ఓ పార్టీలో ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే వేసుకున్న డ్రస్‌పై ఇప్పుడు రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. బికినీ తరహా డ్రస్సులో ఆమె పార్టీకి హాజరైంది అంటూ.. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ కూడా మొదలెట్టారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌లో సెలబ్రిటీలు పార్టీలు చేసుకోవడానికి చిన్న కారణం చాలు. అందులోనూ కరణ్ జోహార్ ప్రతీది సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. అలా తన ధర్మా ప్రొడక్షన్స్ సీఈవో అయిన అపూర్వా మోహత పుట్టినరోజును ఘనంగా కరణ్ సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.


ఈ వేడుకకు ‘లైగర్’ చిత్ర బృందం కూడా హాజరైంది. పూరీ జగన్నాధ్, ఛార్మీ, విజయ్ దేవరకొండ, అనన్యపాండే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందులోనూ స్పెషల్‌గా అనన్యపాండే నిలవడం విశేషం. అందుక్కారణం ఆమె వేసుకున్న డ్రస్సే. బికినీ తరహా డ్రస్సులో ఆమె కనిపించిన తీరు అందరినీ మతి పోగొట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాని కూడా షేక్ చేస్తున్నాయి. ఈ వేడుకలో అనన్య పాండే, విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటున్నప్పుడు చార్మీ తన ఫోన్‌లో బంధించింది. ఆ వీడియోని నెట్‌కి వదలడంతో.. అనన్య డ్రస్‌పై పెద్ద దుమారమే చెలరేగుతుంది. దీనిపై.. ‘అదేం డ్రస్ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. డ్రస్ చూసి జడ్జ్ చేయవద్దంటూ.. ఎదురు కౌంటర్లు వచ్చేస్తాయి కాబట్టి.. ఈ వీడియో చూడండి, అంతేగానీ కామెంట్స్ మాత్రం చేయకండి’ అంటూ కొందరు నెటిజన్లు కామ్‌గా సెటైర్లు వదులుతున్నారు.



Updated Date - 2022-03-19T02:47:24+05:30 IST