షారుక్ తనయుడితో స్విమ్మింగ్ పూల్‌లో అందాల భామలు.. వైరలవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-03-09T21:11:24+05:30 IST

‘లైగర్’ భామ అనన్య పాండే, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహనా ఖాన్, నటుడు సంజయ్ కపూర్ తనయ షానయా కపూర్...

షారుక్ తనయుడితో స్విమ్మింగ్ పూల్‌లో అందాల భామలు.. వైరలవుతున్న వీడియో

‘లైగర్’ భామ అనన్య పాండే, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహనా ఖాన్, నటుడు సంజయ్ కపూర్ తనయ షానయా కపూర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తుంటారు. బాల్యంలో మొదలైన వారి బంధం అంతే స్ట్రాంగ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా సైతం ఈ ముగ్గురు భామలు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు.


వారితో పాటు షారుక్ ఖాన్ తనయుడు, చిన్నారి అబ్‌రామ్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన పిక్‌ని, వీడియోని అనన్య పాండే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అది పూల్ లోపల ఫొటోల కోసం ఫోజులిస్తున్నప్పుడు తీసిన బుమరాంగ్ వీడియో. దానికి.. ‘ఒక మహిళ ఉన్నచోట, చాలా మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్ చుట్టూ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇది వైరల్‌గా మారింది. దీంతో ఈ ముగ్గురు అందాల భామలకి ఫిదా అయిన ఎంతోమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-03-09T21:11:24+05:30 IST