Ananya Nagalla: నాకు కాబోయేవాడోవరో చెప్పండి..ప్లీజ్‌!

ABN , First Publish Date - 2022-10-02T21:15:54+05:30 IST

చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’తో కథానాయికగా తెలుగుతెరకు పరిచయమయ్యారు అనన్య నాగళ్ల. ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వదులుకొని సినిమాల్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనే చక్కని గుర్తింపు పొందారు.

Ananya Nagalla: నాకు కాబోయేవాడోవరో చెప్పండి..ప్లీజ్‌!

చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’తో కథానాయికగా తెలుగుతెరకు పరిచయమయ్యారు అనన్య నాగళ్ల (Ananya nagalla). ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వదులుకొని సినిమాల్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనే చక్కని గుర్తింపు పొందారు. తదుపరి ‘ప్లేబ్యాక్‌’ సినిమాలో కథానాయికగా నటించిన ఈమెకు మూడో సినిమాకే పవన్‌కల్యాణ్‌ చిత్రంలో అవకాశం దక్కింది. ‘వకీల్‌ సాబ్‌’ (Vakeel saab) చిత్రంలో అవకాశం అందుకుని దివ్యా నాయక్‌గా ఆ పాత్రకు న్యాయం చేశారు. హాట్‌హాట్‌ ఫోటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో కుర్రకారు మదిలో వేడి పుట్టించే ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ప్రేమలో ఉందనీ త్వరలోనే అతనితో ఏడడుగులు వేయనుందని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. (Ananya nagalla marriage rumour)


(Ananya Setires)ఈ విషయం అనన్యా దృష్టికి వెళ్లగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె సోషల్‌ మీడియాలో వెటకారంగా స్పందించింది. ‘‘నాకోసం పెళ్లి కొడుకునిని వెతికినందుకు ధన్యవాదాలు. దయ చేసి అతనెవరో నాకు కూడా చెప్పండి. అలాగే పెళ్లి తేదీ, సమయాన్ని కూడా తెలియజేయండి. అలాగైతేనే నా పెళ్లికి నేను హాజరు కాగలను’’ అని వ్యంగ్యంగా స్పందించింది. తను సింగిల్‌గా ఉన్నట్లు చెప్పినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ నిర్మాత కొడుకు ఎవరు అని సెర్చింగ్‌ చేస్తూనే ఉన్నారు. 






Updated Date - 2022-10-02T21:15:54+05:30 IST