ఇలాంటి అద్భుత అవకాశాన్ని తిరస్కరిస్తామా?: నాగ్ అశ్విన్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2022-03-05T02:09:16+05:30 IST

‘భవిష్యత్‌కు సంబంధించిన ఇలాంటి అద్బుత అవకాశాన్ని మేమెందుకు తిరస్కరిస్తాం?.. మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలు మహీంద్రా.. మీరడిగిన సహకారం అందిస్తారు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని..

ఇలాంటి అద్భుత అవకాశాన్ని తిరస్కరిస్తామా?: నాగ్ అశ్విన్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా

‘‘భవిష్యత్‌కు సంబంధించిన ఇలాంటి అద్బుత అవకాశాన్ని మేమెందుకు తిరస్కరిస్తాం?.. మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలు మహీంద్రా.. మీరడిగిన సహకారం అందిస్తారు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని.. అధునాతనమైన xuv700 వాహనాన్ని ఇప్పటికే ఆయన రూపొందించడం జరిగింది..’’ అని నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌కు ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అత్యాధునికమైన టెక్నాలజీతో వాహనాలను రూపొందిస్తున్నామని తెలుపుతూ.. ఈ వాహనాల విషయంలో ఆటో మొబైల్ దిగ్గజమైన ఆనంద్ మహీంద్రా సహకారం కోరుతూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా పై విధంగా స్పందించారు.


ఆనంద్ మహీంద్ర స్పందనకు బదులిచ్చిన నాగ్ అశ్విన్.. ‘‘ధన్యవాదాలు సార్.. మీ ఎలక్ట్రిక్ మొబిలిటీ నైపుణ్యం కూడా కావాలి. అలాగే మీరు చెప్పిన వేలు మహీంద్రాగారితో కలిసి పనిచేసేందుకు ఎంతగానో వేచిచూస్తున్నాను..’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘ప్రాజెక్ట్ కె’ విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  



Updated Date - 2022-03-05T02:09:16+05:30 IST