అందాల అప్సరస వచ్చింది

ABN , First Publish Date - 2022-09-28T11:46:58+05:30 IST

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు...

అందాల అప్సరస వచ్చింది

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘అప్సరస.. అప్సరస’ అనే గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఈ గీతాన్ని శ్రీమణి రాశారు. రేవంత్‌ ఆలపించారు. ‘‘ఈ చిత్రంలో మొత్తం ఏడు గీతాలున్నాయి. ఘంటాడి కృష్ణ అద్భుతమైన ట్యూన్స్‌ అందించారు. వాటిని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకొంటుంది. చిత్రీకరణ కూడా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు. సమర్పణ: బెక్కం వేణుగోపాల్‌. 

Updated Date - 2022-09-28T11:46:58+05:30 IST