నేపాల్‌లో భిక్షాటన చేస్తోన్న ఆ భారతీయ అమ్మాయి... అనర్గళంగా ఆంగ్లం మాట్లాడింది! తరువాత ఏమైందంటే...

ABN , First Publish Date - 2021-11-03T19:39:17+05:30 IST

ఆ అమ్మాయిది రాజస్థాన్. కానీ, విధి ఆమెని నేపాల్ వరకూ లాక్కెళ్లింది. దేశం కాని దేశంలో వీధుల వెంట భిక్షాటన చేసేలా కఠిన పరీక్ష పెట్టింది...

నేపాల్‌లో భిక్షాటన చేస్తోన్న ఆ భారతీయ అమ్మాయి... అనర్గళంగా ఆంగ్లం మాట్లాడింది! తరువాత ఏమైందంటే...

ఆ అమ్మాయిది రాజస్థాన్. కానీ, విధి ఆమెని నేపాల్ వరకూ లాక్కెళ్లింది. దేశం కాని దేశంలో వీధుల వెంట భిక్షాటన చేసేలా కఠిన పరీక్ష పెట్టింది. అయినా అన్నీ ఓర్చుకుని నిబ్బరంగా నిలబడిన ఆ సాహసి ఎట్టకేలకు మంచి కాలంలోకి అడుగుపెట్టింది. తను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దృష్టిలో పడింది!

నేపాల్ సందర్శనలో ఉన్న అనుపమ్ ఖేర్ ఓ దేవాలయం ముందు ఆర్తిని చూశారట. ఆమె అక్కడ భిక్షాటన చేస్తోంది. అయితే, అలా అడుక్కునే వారు గుళ్ల ముందు చాలా మందే ఉంటారు. ఈమె ప్రత్యేకత ఏంటంటే, అనుపమ్‌తో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడటం! తనతో ఇంగ్లీషులో గళగళా మాట్లాడేస్తోన్న ఆమె రాజస్థాన్ అమ్మాయని ఖేర్ తెలుసుకున్నారు. ఓ భారతీయ అమ్మాయి అలా నేపాల్లో భిక్షాటన చేయటమే ఎంతో దయనీయం. అంతకంటే మించి, తనకు చదువు మీద తీవ్రమైన ఆసక్తి ఉండటం, ఇంగ్లీషు తడుముకోకుండా మాట్లాడగలగటం, అయినా తన బాల్యం విదేశంలో వీధుల పాలు కావటం... మరింత విషాదం.

ఆర్తికి చదువు పట్ల ఉన్న ఆర్తిని గ్రహించిన అనుపమ్ ఖేర్ తక్షణం ఆమెను తమ ‘అనుపమ్ ఖేర్ ఫౌండేషన్’ తరుఫున ఆదుకునే ఏర్పాట్లు చేశారు. ఇక మీదట ఆమె ఏ ఇబ్బందీ లేకుండా చదువుకుంటుందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు! అనుపమ్ ఖేర్‌తో ఆర్తి ఆంగ్లంలో మాట్లాడిన వీడియో ఇఫ్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.  ఖేర్ స్వయంగా ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలోయర్స్‌తో పంచుకున్నారు...     

Updated Date - 2021-11-03T19:39:17+05:30 IST