ఆమె వల్ల నా జీవితం నాశనమైంది.. వదిలిపెట్టేది లేదంటున్న ప్రముఖ నటుడు.. ‘మీటూ’ కేసులో రివర్స్ ఫైర్..!

ABN , First Publish Date - 2022-04-27T22:07:26+05:30 IST

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ యువనటి ఆరో‌పించింది. దీంతో ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కేసు నమోదైంది.

ఆమె వల్ల నా జీవితం నాశనమైంది.. వదిలిపెట్టేది లేదంటున్న ప్రముఖ నటుడు.. ‘మీటూ’ కేసులో రివర్స్ ఫైర్..!

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ యువనటి ఆరో‌పించింది. దీంతో ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అతడు నమ్మించాడని ఆమె చెప్పింది. కొచ్చిలోని తన ఫ్లాట్‌కు పిలిచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ బాబు ఫేస్‌బుక్ వేదికగా ఈ ఘటనపై స్పందించాడు. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నాడు. ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. 


యువ నటికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విజయ్ బాబు తెలిపాడు. ‘‘నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసులో నేనే బాధితుణ్ని. మన దేశంలోని చట్టాలు ఆమెకు రక్షణ కల్పిస్తున్నాయి. ఆమె వల్ల నా జీవితం నాశనమైంది. నాపై చేసిన ఆరోపణాలు చిన్నవి కావు. అందువల్ల ఆమెను సులభంగా వదిలిపెట్టను. సాక్ష్యాధారాలన్నింటిని నేను బయటపెట్టగలను. కానీ, వాటిని బయటపెడితే ఆమె కుటుంబానికి హాని జరిగే అవకాశం ఉంది. ఆ నటికి వ్యతిరేకంగా నేను పరువునష్టం దావా వేస్తాను. ఈ ఆరోపణాలు కొత్త ‘మీటూ’ మూవ్‌మెంట్‌కు ప్రారంభం. వీటిపై కొత్తగానే పోరాడాలి’’ అని విజయ్ బాబు పేర్కొన్నాడు. 


విజయ్ బాబు మలయాళం ఇండస్ట్రీలో పేరు పొందిన నటుడు, నిర్మాత. ‘ఫ్రైడే ఫిల్మ్ హౌస్’ అనే ప్రొడక్షన్ కంపెనీని అతడు స్థాపించాడు. దశాబ్దాకాలంగా సినీ ఇండస్ట్రీలో అతడు కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. మాలయాళం ఇండస్ట్రీలో  లైంగిక వేధింపుల కేసులు గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్నాయి. దిలీప్ కుమార్, లిజు కృష్ణ వంటి వారు ఇప్పటికే ఆరోపణాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

Updated Date - 2022-04-27T22:07:26+05:30 IST