ఏం చేసుకుంటారో చేసుకొమ్మంటోన్న Daddy Bachchan

ABN , First Publish Date - 2022-04-07T23:03:21+05:30 IST

అమితాబ్ బచ్చన్ సాధారణంగా ఎంతో సహనం ప్రదర్శిస్తారు. అదీ సొషల్ మీడియాలో అయితే మరింత గౌరవంగా తన అభిప్రాయాలు వెలిబుచ్చుతుంటారు. కానీ, అటువంటి పెద్దాయనకి కూడా కాస్త కోపం వచ్చింది. కారణం అభిషేక్ బచ్చన్ పేరు మీద జరుగుతోన్న ట్రోలింగే...

ఏం చేసుకుంటారో చేసుకొమ్మంటోన్న Daddy Bachchan

అమితాబ్ బచ్చన్ సాధారణంగా ఎంతో సహనం ప్రదర్శిస్తారు. అదీ సొషల్ మీడియాలో అయితే మరింత గౌరవంగా తన అభిప్రాయాలు వెలిబుచ్చుతుంటారు. కానీ, అటువంటి పెద్దాయనకి కూడా కాస్త కోపం వచ్చింది. కారణం అభిషేక్ బచ్చన్ పేరు మీద జరుగుతోన్న ట్రోలింగే... 


అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘దస్వీ’. ఆ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే బిగ్ బి ‘ఎంతో బావుం’దంటూ మెచ్చుకున్నాడు. కానీ, నెటిజన్స్ ఈ విషయాన్ని రచ్చ చేశారు. సీనియర్ బచ్చన్ తన కొడుకు సినిమాని ఉద్దేశ్యపూర్వకంగా ప్రమోట్ చేస్తున్నాడంటూ ట్రోలింగ్ ప్రారంభించారు. తన గురించి జనం అలా మాట్లాడటం బాలీవుడ్ సూపర్ స్టార్ కి అస్సలు నచ్చలేదు. దాంతో ‘‘అయ్యా... అవును... నేను శుభాకాంక్షలు చెబుతాను, ప్రచారం చేస్తాను, మంగళాశాసనాలు(సినిమా సక్సెస్ కావాలని ఆశీర్వదించటం...) చేస్తాను. మీరేం చేయగలరు?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. 


అభిషేక్ బచ్చన్ నటించిన ‘దస్వీ’ ఏప్రెల్ 7 నుంచీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. యమీ గౌతమ్, నిమ్రత్ కౌర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అమితాబ్ బచ్చన్ లాగే అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కూడా కొడుకు సినిమాని ప్రమోట్ చేయటంలో తన వంతు కృషి చేశారు. ‘దస్వీ’ ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన కథ కావటంతో సినిమాని ప్రత్యేకంగా తన రాజకీయ రంగ మిత్రులకి ఆమె ప్రదర్శించి చూపారు.  

Updated Date - 2022-04-07T23:03:21+05:30 IST