ఆ హీరోతో అమితాబ్ బచ్చన్ మనవరాలు డేటింగ్ చేస్తుందా..?

ABN , First Publish Date - 2022-04-22T02:06:33+05:30 IST

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా, బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో పుకార్లు చేస్తున్నాయి.

ఆ హీరోతో అమితాబ్ బచ్చన్ మనవరాలు డేటింగ్ చేస్తుందా..?

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా, బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందని బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట సీరియస్ రిలేషన్ షిప్‌ కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ వార్తలపై నవ్య, సిద్దాంత్ ఎప్పుడూ కూడా పెదవి విప్పలేదు. కానీ, సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్‌లకు మరొకరు రిప్లై ఇస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉన్నారని తెలుస్తోంది. 


బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. హాలీడేను సరదాగా గడుపుతున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేది కూడా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లను బట్టి ఈ జంట రిషికేష్‌లో ఎంజాయ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇద్దరు పోస్ట్ చేసిన ఫొటోల్లో ఓ వైట్ బ్రిడ్జ్ కామన్‌గా కనిపిస్తుంది. దీంతో ఈ జంట డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. సిద్దాంత్ చతుర్వేది ‘గల్లీ భాయ్’, ‘గెహ్రాయియా’ సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితం తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై అతడు స్పందించాడు. ‘‘నా భాగస్వామి పేరును బయటకు వెల్లడించను’’ అని సిద్దాంత్ తెలిపాడు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి నవ్య కొన్ని రోజుల క్రితం ఓ స్టార్టప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 





Updated Date - 2022-04-22T02:06:33+05:30 IST