బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న Amitabh Bachchan మనవరాలు

ABN , First Publish Date - 2021-11-19T23:04:36+05:30 IST

అమితాబ్ బచ్చన్ మనవరాలైన నవ్య నవేలీ నందా ఒక స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందని బీ టౌన్ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయి.

బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న Amitabh Bachchan మనవరాలు

అమితాబ్ బచ్చన్ మనవరాలైన నవ్య నవేలీ నందా ఒక స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందని బీ టౌన్ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయి. నవ్య లవ్ లైఫ్ గురించి అనేక సార్లు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి.  ప్రతిసారి ఆ వార్తలన్నింటిని ఆమె ఖండించింది. బాలీవుడ్ హీరో అయిన సిద్దాంత్ చతుర్వేదితో ఆమె డేటింగ్ చేస్తున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిద్దాంత్ చతుర్వేది గల్లీబాయ్ సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశాడు.


అతడు మాత్రం నవ్య తనకు మంచి స్నేహితురాలు అని చెబుతున్నాడు. అటువంటి కథనాలన్నింటిని పుకార్లుగా కొట్టి పారేస్తున్నాడు. కానీ, గత కొంతకాలంగా  వారిద్దరూ సిరీయస్ రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్‌కు అభిషేక్ బచ్చన్‌తో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు శ్వేత బచ్చన్. ఆ శ్వేత బచ్చన్ కూతురే నవ్య నవేలీ నందా.


నవ్య నవేలీ నందా ఈ మధ్యనే ఒక స్టార్టప్‌ను ప్రారంభించింది. ఆ స్టార్టప్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పనిచేస్తుంది.  వ్యాపారంలో నవ్య అద్భుతంగా పనిచేస్తుందని పెప్సీకో సీఈవో అయిన ఇంద్ర నూయి కొన్నిరోజుల క్రితం  ప్రశంసించారు.  


Updated Date - 2021-11-19T23:04:36+05:30 IST