ఈ పాప ఎవరో గుర్తు పట్టగలరా..? నెట్టింట VIRAL గా మారిన స్టార్ హీరో మనవరాలి ఫొటో..!

ABN , First Publish Date - 2022-05-07T23:20:59+05:30 IST

ఆమె బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇవ్వకపోయినా సొషల్ మీడియాలో మాత్రం పెద్ద సెన్సేషనే. ఆమెకు ఆన్ లైన్ ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. తన స్టైల్ స్టేట్మెంట్ తో ఫాలోయర్స్ ను మాయ చేసే తాను తరుచుగా అందమైన ఫోటోల్ని, వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, ఆమె తాజాగా నెటిజన్స్ తో పంచుకున్న ఓ త్రోబ్యాక్ పిక్ సొషల్ మీడియాలో లెటెస్ట్ టాక్ గా మారింది...

ఈ పాప ఎవరో గుర్తు పట్టగలరా..? నెట్టింట VIRAL గా మారిన స్టార్ హీరో మనవరాలి ఫొటో..!

అమితాబ్ మనవరాలు నవ్యా నవేలీ నందా బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇవ్వకపోయినా సొషల్ మీడియాలో మాత్రం పెద్ద సెన్సేషనే. ఆమెకు ఆన్ లైన్ ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. తన స్టైల్ స్టేట్మెంట్ తో ఫాలోయర్స్ ను మాయ చేసే Navya Naveli Nanda తరుచుగా తన అందమైన ఫోటోల్ని, వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, ఆమె తాజాగా నెటిజన్స్ తో పంచుకున్న ఓ త్రోబ్యాక్ పిక్ సొషల్ మీడియాలో లెటెస్ట్ టాక్ గా మారింది...


Amitabh Bachchan కూతురు శ్వేతా బచ్చన్ గారాల పట్టి నవ్య. నందా ఫ్యామిలీ వారసురాలైన ఆమె తాజాగా తన చిన్న నాటి ఫోటో ఒకటి షేర్ చేసింది. బ్లాక్ స్కర్ట్ అండ్ లైట్ కలర్ టాప్ ధరించిన చిన్నారి నవ్య... భలే ముద్దొచ్చేస్తోంది. కాళ్లకి షూస్, తలకి హెయిర్ బ్యాండ్ తో క్యూట్ గా ఫోజిచ్చిన ఆమెపైన నెటిజన్స్ అదేపనిగా ప్రేమని కురిపించేస్తున్నారు! నవ్య బెస్ట్ ఫ్రెండ్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ “QT” అంటూ కామెంట్ చేసింది. “QT” అంటే మిలీనియల్స్ భాషలో ‘క్యూట్’ అని అర్థం... 


నవ్య నందా కెమెరా ముందుకొచ్చే ఆలోచన చేయటం లేదుగానీ ఆమె బెస్ట్ ఫ్రెండ్ Suhana మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. పైగా నవ్య సోదరుడు అగస్త్య నంద సరసనే ఆమె తొలి చిత్రం చేస్తోంది కూడా! జోయా అఖ్తర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘The Archies’ మూవీలో సుహానా, అగస్త్య కలసి నటిస్తున్నారు. అదే సినిమాలో జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా నటిస్తుండటం విశేషం. 

Updated Date - 2022-05-07T23:20:59+05:30 IST