Akshay Kumar షాకింగ్ స్టంట్.. Amitabh Bachchan వార్నింగ్!

ABN , First Publish Date - 2021-11-06T18:21:26+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే యాక్షన్ సీక్వెన్స్‌లకు పెట్టింది పేరు.

Akshay Kumar షాకింగ్ స్టంట్.. Amitabh Bachchan వార్నింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే యాక్షన్ సీక్వెన్స్‌లకు పెట్టింది పేరు. ఎంత రిస్కీ సీన్స్‌లో అయినా డూప్‌ లేకుండా స్వయంగా నటిస్తుంటాడు. అక్షయ్ నటించిన తాజా చిత్రం `సూర్యవంశీ`. రోహిత్ షెట్టి రూపొందించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఈ సినిమాలో అక్షయ్ ప్రమాదకరమైన చాపర్ స్టంట్ చేశాడు. `సూర్యవంశీ` సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో అక్షయ్, రోహిత్ షెట్టి, కత్రిన తాజాగా అమితాబ్ బచ్చన్ `కౌన్ బనేగా కరోడ్‌పతి`-13కు హాజరయ్యారు. 


ఆ కార్యక్రమంలో అక్షయ్ ప్రమాదకర స్టంట్ చూసి అమితాబ్ షాకయ్యారు. ఆ షాట్ చిత్రీకరణ సమయంలో అక్షయ్‌కు పెద్ద ప్రమాదం తప్పిందని దర్శకుడు రోహిత్ చెప్పారు. దాంతో అమితాబ్ స్పందిస్తూ.. `సర్.. దయచేసి భవిష్యత్తులో ఇలాంటివి చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైనద`ని అన్నారు. 1980లో తను నటించిన `దోస్తానా` కోసం ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేసి ఇబ్బందులు పడ్డానని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. 

Updated Date - 2021-11-06T18:21:26+05:30 IST