Rashmika Mandanna's Goodbye trailer: పుట్టిన రోజు ప్రతి ఏడు వస్తుంది.. కానీ చావు ఒక్కసారే..

ABN , First Publish Date - 2022-09-06T22:55:44+05:30 IST

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ బ్యూటీ

Rashmika Mandanna's Goodbye trailer: పుట్టిన రోజు ప్రతి ఏడు వస్తుంది.. కానీ చావు ఒక్కసారే..

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా(Rashmika Mandanna). తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగే ఉంది. గతేడాది విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ తరుణంలో ఈ భామ బాలీవుడ్‌లో పలు డైరెక్ట్‌ చిత్రాలు చేస్తుంది. అందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan)తో కలిసి ‘గుడ్ బై(Goodbye)’ అనే చిత్రంలో రష్మిక నటించింది.


ప్రకటించినప్పటి నుంచి ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది. అందులో.. అమితాబ్, రష్మిక తండ్రి, కూతురిగా నటించారు. ఈ మూవీలో చావు తర్వాత జరిగిన సంప్రదాయాలపై ఈ సినిమా పలు ప్రశ్నలను సంధిస్తుంది. చనిపోయిన తన తల్లికి నచ్చని విషయాల కోసం తండ్రితోపాటు ఇతరులతోనూ పోరాడటం ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రేమ, నవ్వులు, కన్నీళ్లు, ఎమోషన్స్‌తో కంటతడి చూసేవారి హృదయాలను హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో రష్మికా చెప్పే.. ‘పుట్టిన రోజు ప్రతి ఏడు వస్తుంది.. కానీ చావు ఒక్కసారే వస్తుంది’ అనే డైలాగ్‌తో బట్టి చావుని సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతుంది. ఆ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.



Updated Date - 2022-09-06T22:55:44+05:30 IST