లింగ వివక్షపై గళమెత్తిన బిగ్ బీ మనవరాలు

ABN , First Publish Date - 2022-02-25T22:24:59+05:30 IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, శ్వేతా బచ్చన్ కూతురు

లింగ వివక్షపై గళమెత్తిన బిగ్ బీ మనవరాలు

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, శ్వేతా బచ్చన్ కూతురు నవ్య నవేలీ నందా కొంత కాలం క్రితమే ఎంటర్ ప్రెన్యూర్‌గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఆమె లేదు. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ, తరచుగా ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా లింగ వివక్ష గురించి నవ్య గళమెత్తింది.


ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే తాను హోస్ట్‌గా వ్యవహరిస్తానని నవ్య చెప్పింది. కానీ, తన సోదరుడు అతిథ్యం ఇవ్వడని ఆమె పేర్కొంది. ‘‘బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే వారికి అతిథ్యం ఇవ్వలాని మా అమ్మ నాకు చెబుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో అతిథులను చూసుకునే బాధ్యతను కూతురు భుజాన్నే వేస్తారు. ఆ బాధ్యతను ఎప్పుడూ నా తమ్ముడికి ఇవ్వలేదు’’ అని నవ్య చెప్పింది. ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్ అధినేత నిఖిల్ నందా, శ్వేతా బచ్చన్‌ల కూతురే నవ్య నవేలీ నందా. ఆమెకు అగస్త్య నందా అనే సోదరుడు ఉన్నాడు. ఆమె ఓ వర్చువల్ ప్లాట్‌ఫాం ‘ఆరా’ను స్థాపించింది. మహిళలకు సంబంధించిన ఆరోగ్య ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తూంటుంది.

Updated Date - 2022-02-25T22:24:59+05:30 IST