‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అమితాబ్ మద్ధతు.. విమర్శలు చేస్తున్న నెటిజన్లు.. అసలు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-18T16:18:29+05:30 IST

‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఈ సినిమా ఇప్పుడో సంచలనం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు..

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అమితాబ్ మద్ధతు.. విమర్శలు చేస్తున్న నెటిజన్లు.. అసలు ఏమైందంటే..

‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఈ సినిమా ఇప్పుడో సంచలనం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.  1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాల నేఫథ్యంతో వచ్చిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైతం పరోక్షంగా ఈ సినిమాకి సోషల్ మీడియాలో మద్ధతు తెలిపారు.


అమితాబ్ ట్విటర్‌లో.. ‘గతంలో మనకు తెలియనిది.. ఇప్పుడు మనకు తెలుసు’ అని ట్వీట్ చేశారు. అయితే ఇందులో డైరెక్ట్‌గా సినిమా పేరు రాయకపోయినప్పటికీ అది ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించేనని నెటిజన్లు అనుకుంటున్నారు. కానీ అందులో మూవీ పేరు మెన్షన్ చేయపోవడం వారి ఆగ్రహానికి కారణమైంది. దీంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


‘మీరు ఈ ట్వీట్‌లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ పేరు పెట్టవచ్చు కదా.. ఎందుకంత భయం?’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసింది. ‘ఇది ముక్తసరిగా చెబుతున్నారా.. లేక భయం వల్లనా?’ అని మరొకరు విమర్శలు చేస్తూ ఆయన ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా మరికొందరు సైతం ఇలా భయపడుతూ చెప్పనవసరం లేదంటూ కామెంట్స్ చేశారు.









Updated Date - 2022-03-18T16:18:29+05:30 IST