మా తాత నుంచి ఆ విషయాలు నేర్చుకున్నాను: Navya Naveli Nanda

ABN , First Publish Date - 2022-07-07T23:07:43+05:30 IST

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ వారసులు సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. వేరే రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం అరుదు. కానీ, కొంత మంది మాత్రం వేరే రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడంతో పాటు తమ

మా తాత నుంచి ఆ విషయాలు నేర్చుకున్నాను: Navya Naveli Nanda

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ వారసులు సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. వేరే రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం అరుదు. కానీ, కొంత మంది మాత్రం వేరే రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడంతో పాటు తమ ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తుంటారు. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసింది నవ్య నవేలీ నందా (Navya Naveli Nanda). ఆమె ఎవరనే కదా మీ సందేహం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) మనవరాలు, శ్వేతా బచ్చన్ (Shweta Bachchan) కూతురే ఈ నవ్య. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికీ నవ్య హైదరాబాద్‌కు వచ్చింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపింది. 


గతంలో హైదరాబాద్‌కు ఎప్పుడు రాలేదని నవ్య నవేలీ నందా చెప్పింది. ‘‘గతంలో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం రాలేదు. ప్రస్తుతం ఎంటర్ ప్రెన్యూర్‌గా రావడం సంతోషకరంగా ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న పనిలో సంతోషంగా ఉన్నాను. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి నాకు ఎప్పుడు లేదు. నేను ఏదైనా కొత్తగా చేయాలని అనుకునేదానిని. అందుకే ఆరా హెల్త్ అనే కంపెనీని స్థాపించాను. మహిళలకు సంబంధించిన ఉత్పత్తులను ఆ కంపెనీ విక్రయిస్తుంటుంది. మహిళలకు సంబంధించిన విషయాలను మన దేశంలో బహిరంగంగా మాట్లాడరు’’ అని నవ్య  చెప్పింది. తల్లి పాత్రను నిర్వహించడం అనేది ఫుల్‌టైమ్ జాబ్ అని ఆమె పేర్కొంది. కానీ, వారికి మనం పూర్తి క్రెడిట్‌ను ఇవ్వమని వెల్లడించింది. మా అమ్మ నాకు అనేక విషయాల్లో స్ఫూర్తి అని స్పష్టం చేసింది. మా తాత నుంచి క్రమశిక్షణ, కష్టపడటాన్ని నేర్చుకున్నానని తెలిపింది.



Updated Date - 2022-07-07T23:07:43+05:30 IST