Tarak: తారక్‌ని కలవటం బిజెపికి కలిసొచ్చిందిట.. అదెలా?

ABN , First Publish Date - 2022-08-31T23:03:57+05:30 IST

కొన్ని రోజుల కిందట సెంట్రల్ హోమ్ మినిష్టర్ అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)ని కలిసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజులకు బిజెపి..

Tarak: తారక్‌ని కలవటం బిజెపికి కలిసొచ్చిందిట.. అదెలా?

కొన్ని రోజుల కిందట సెంట్రల్ హోమ్ మినిష్టర్ అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)ని కలిసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజులకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా (J. P. Nadda) హైదరాబాద్ వచ్చి ఇంకో నటుడు నితిన్‌ (Nithiin)ని కలిసిన విషయం కూడా తెలిసిందే. దీని మీద చాలా మంది చాలా కథనాలు రాశారు. కొందరు సినిమా కోసమని, కొందరు తమ పార్టీలోకి చేరమని ఆహ్వానించటానికని, ఇంకా ఏవేవో రాశారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం ఏమిటంటే.. త్వరలో మునుగోడు బై ఎలక్షన్‌ (Munugode byelection)లో విజయం కోసం బిజెపి (BJP) ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. అందులో వ్యూహామే ఈ నటులను కలవటం వెనక వున్న రహస్యమని చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు. 


ఎన్టీఆర్‌ని అమిత్ షా కలిసినప్పటి నుంచి.. ఆ పార్టీ, అమిత్ షా, ఎన్టీఆర్ అందరూ ట్రెండింగ్‌లో వున్నారు. అయితే అది పాజిటివ్, నెగిటివ్ అన్నది అనవసరమని.. పార్టీకి కావాల్సింది.. తమ పార్టీ పేరు తెలంగాణ (Telangana)లో అందరికి తెలియటం కోసమే వారు ఈ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. ఈ లెక్కన వారి ప్లాన్ వర్కవుట్ అయినట్లే. ఎన్టీఆర్‌ని కలిసిన తర్వాత ఆ పార్టీ పేరు నిజంగానే తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. ఇదిలా ఉంటే.. ముందు ముందు మరికొంత మంది బిజెపి నాయకులు హైదరాబాద్ (Hyderabad) వస్తారని.. క్రేజ్ ఉన్న తెలుగు నటుల్ని కలుస్తారని కూడా చిత్రసీమలో వినబడుతోంది. 


ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ (TRS party) మొదటి స్థానంలో వుందని అనుకుంటూ ఉంటే, ఈ నటుల్ని కలిశాక బిజెపి ఇప్పుడు ఆ మొదటి స్థానాన్ని ఆక్రమించిందని అంటున్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే.. బిజెపి అలవోకగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఈసారి ఏ నటుల్ని పిలిచి కలుస్తారో చూడాలి. బిజెపి వాళ్ళ ప్లాన్ అయితే ఇప్పటివరకు బాగానే వర్కవుట్ అయిందని చెప్పుకోవచ్చు.



Updated Date - 2022-08-31T23:03:57+05:30 IST