Sudeep Hindi Language Controversy: దక్షిణాది సినిమాలపై అజయ్ దేవ్‌గణ్ ప్రశంసలు.. అలా చేస్తే హిందీ చిత్రాలు కూడా..

ABN , First Publish Date - 2022-04-29T19:36:19+05:30 IST

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు సుదీప్ మధ్య నడుస్తున్న హిందీ భాష వివాదం గురించి తెలిసిందే...

Sudeep Hindi Language Controversy: దక్షిణాది సినిమాలపై అజయ్ దేవ్‌గణ్ ప్రశంసలు.. అలా చేస్తే హిందీ చిత్రాలు కూడా..

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు సుదీప్ మధ్య నడుస్తున్న హిందీ భాష వివాదం గురించి తెలిసిందే. ఈ విషయమై వారి మధ్య ట్విట్టర్‌లో ఓ యుద్ధమే నడిచింది. ఈ తరుణంలోనే అజయ్ తాజా చిత్రం ‘రన్‌ వే 34’ ఈ రోజు (ఏప్రిల్ 29)న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై అజయ్ ప్రశంసలు కురిపించాడు.


ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దక్షిణాది సినిమాలు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు హిందీ బెల్ట్‌లో మంచి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ తరుణంలో బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో అంతగా అడకపోవడంపై రకరకాల వాదనలు వినిపించాయి. ఈ విషయంపై అజయ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో భారీస్థాయిలో విడుదల కావడం లేదు. దక్షిణాది వారిలా ఇక్కడి సినిమాలను అక్కడ పెద్ద స్థాయిలో విడుదల చేయడానికి ఎవరూ ప్రయత్నించట్లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సౌత్ సినిమాలు ఇక్కడి రాణించినట్లుగానే.. మా మూవీస్ సైతం అక్కడ మంచి రెస్పాన్స్‌ని అందుకుంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.


అజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘సౌత్ సినిమాలు అద్భుతంగా ఉంటున్నాయి. అందుకే హిందీ బెల్ట్‌లో బాగా ఆడుతున్నాయి. అలాగే బాలీవుడ్ మూవీస్ కూడా వాటి జోరును కొనసాగిస్తున్నాయి. అయితే.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను నార్త్‌లోనూ గొప్పగా రిలీజ్ చేయాలని ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాల్లో నార్త్‌కు చెందిన నటీనటులను తీసుకుని, వారి సినిమాలు పాన్ ఇండియాలో నడిచేలా స్క్రిప్ట్‌లను రాసుకుంటున్నారు. కానీ బాలీవుడ్ మేకర్స్ ఆ ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు’ అని తెలిపాడు.

Updated Date - 2022-04-29T19:36:19+05:30 IST