Ajay Devgn-Sudeep row: బాలీవుడ్ నటులపై సంచలన కామెంట్స్ చేసిన అజయ్ దేవ్‌గణ్

ABN , First Publish Date - 2022-04-28T19:51:18+05:30 IST

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు కిచ్చ సుదీప్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే...

Ajay Devgn-Sudeep row: బాలీవుడ్ నటులపై సంచలన కామెంట్స్ చేసిన అజయ్ దేవ్‌గణ్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు కిచ్చ సుదీప్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో అజయ్ దేవ్‌గణ్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ మీ భాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. ఈ వార్ ఇలా కొనసాగుతుండగా.. కొన్ని ట్వీట్స్ తర్వాత ఒకరిని ఒకరు ఫ్రెండ్స్ అని పిలుచుకోవడంతో ఈ వివాదం కొంత సద్ధుమణిగినట్లైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా ఈ విషయమై బాలీవుడ్ నటులపై అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


అజయ్ మాట్లాడుతూ.. ‘పరిశ్రమలో ఏదైనా చెడు జరిగినప్పుడు, ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. ఇతర పరిశ్రమల్లో ఇలా జరగదు. ఎక్కడ ఏం జరిగినా ప్రతిదానికి రియాక్షన్ ఉంటుంది. కానీ ఎందుకు ఈ సెలబ్రిటీలు మౌనంగా ఉన్నారో, దాని గురించి ఎందుకు మాట్లాడరో అర్థం కావట్లేదు. మీరు మంచి చేసినా, చెడు చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది.


కానీ.. సినీ పరిశ్రమలో మాత్రమే ఎవరైనా చెడ్డ పని చేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తిడతారు. ఇతర పరిశ్రమల్లో ఇలాగే జరుగుతుందా? లేదు కదా. వేరే పరిశ్రమల్లో ఎవరైనా వ్యక్తి నేరం చేసి పట్టుబడితే ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించరు. కేవలం ఆ వ్యక్తిని మాత్రమే నిందిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్కరూ మొత్తం సినీ ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తారు. ఆ పర్సన్ పాపులర్ అయినా కాకపోయినా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంకో విషయం ప్రతి చోట మీకు సపోర్టు చేసేవారు.. మిమ్మల్ని విమర్శించేవారు ఉంటారు. అందరికీ ఆ భయం ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు కొన్ని విషయాలపై స్పందించాలి కదా’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-28T19:51:18+05:30 IST